
పెళ్లి తర్వాత హీరో నాగ చైతన్య హీరోయిన్ శోభిత చాలా చక్కగా తమ మ్యారీడ్ లైఫ్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇద్దరు తమ తమ వర్క్ షీట్స్ తో బిజీగా అయిపోతున్నారు . ఎంత బిజీగా ఉన్నా ఒకరికి ఒకరు టైం స్పెండ్ చేసుకుంటున్నారు . రీసెంట్ గా ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది శోభిత. అందులో తన కొన్ని స్టైలిష్ ఫొటోస్ షేర్ చేసింది . "జారా బ్రాండ్ ప్రమోట్ చేస్తూ ఈ పండుగ సీజన్లో నిర్మాణం మరియు మృదుత్వం చాలా ఇంపార్టెంట్ అంటూ జారా లో పండుగ సేకరణ కనుగొనండి అనే క్యాప్షన్ జోడించింది ". దీంతో ఈ ఫోటోలు కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ ఫొటోస్ లో శోభిత ధూళిపాళ్ళ చాలా అట్రాక్టివ్ గా కనిపించింది అంటున్నారు అభిమానులు . అయితే ఇదే మూమెంట్లో ఆమెకు సంబంధించిన కొన్ని ఓల్డ్ ఫొటోస్ కూడా వైరల్ అవుతున్నాయి. శోభిత ధూళిపాల గతంలో నటించిన "లవ్ సితార" అనే సినిమాలోని ఒక పిక్చర్ బాగా వైరల్ గా మారింది . అందులో ఆమె బేబీ బంప్ తో కనిపిస్తున్నట్లు ఉంటుంది . ఈ బేబీ బంప్ పిక్చర్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతుంది . శోభిత ధూళిపాళ్ళ ప్రెగ్నెంట్ అంటూ కొంతమంది ఫేక్ థంబ్నెయిల్ తో అభిమానులను మోసం చేస్తున్నారు. అయితే గతంలో చాలా సార్లు ఈ విధంగా శోభిత ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపించాయి. చాలాసార్లు అది ఫేక్ అంటూ శోభిత ధూళిపాళ్ళ క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు మరొకసారి శోభిత ధూళిపాళ్ళ ఓల్డ్ పిక్స్ వైరల్ చేస్తూ ఆమె ప్రెగ్నెంట్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు కొంతమంది ఆకతాయిలు . కాగా శోభిత ధూళిపాల తెలుగులో రెండు ప్రాజెక్ట్ లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ రెండు ప్రాజెక్టులల్లో ఏ ఒక్క ప్రాజెక్ట్ హిట్ అయినా ఇండస్ట్రీలో ఆమె పేరు మారుమ్రోగిపోవాల్సిందే..!