తెలంగాణ రాష్ట్రంలో గత 15 ఏళ్ల క్రితం  బీజేపీ అనే పదం లేకుండా ఉండేది. ఎప్పుడైతే బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటులో బీజేపీ నుండి విజయం సాధించారో అప్పటినుంచి తెలంగాణలో బీజేపీ ఊపు కనిపించింది. ఇది గమనించిన ఢిల్లీ బీజేపీ అధిష్టానం  బండి సంజయ్ ని బీజేపీ అధ్యక్షుడిగా చేసి చాలా సపోర్ట్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో బీజేపీ ని ఓ స్థాయికి తీసుకొచ్చారు. తెలంగాణలో 8 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. అలాంటి బీజేపీ ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో అప్పుడే ఏదో ఒక నిర్ణయం తీసుకొని చివరికి వెనుకబడిపోతుంది. ప్రస్తుతం తెలంగాణలో  స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ కొత్త అధ్యక్షుడైన రామచంద్రరావుని ఎన్నుకుంది.. 

ప్రస్తుతం ఈయనపై  ఒక పెద్ద సవాలే ఉంది.. అయితే బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాగా జనసేన టిడిపితో కలిసి ఇక్కడ పోటీ చేస్తాయని అందరూ భావిస్తున్నారు. అలా చేస్తే పాజిటివ్ రిజల్ట్ రాకపోగా బీజేపీ కి ఉన్న కేడర్ అంతా తుడిచిపెట్టుకుపోతుందని రాజకీయ మేధావులు అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణలో పొత్తు పెట్టుకుంటే మాత్రం తప్పకుండా బీజేపీ కి నష్టం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తూ వస్తోంది. ఇంతకుముందు తరం అంతా బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసారు.

 ఎప్పుడైతే కాంగ్రెస్ గెలిచిందో అప్పటినుంచి చాలా వరకు తెలుగుదేశం క్యాడర్ కాంగ్రెస్ తో అటాచ్మెంట్ పెట్టుకుంది.. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ఎవరితో పొత్తు పెట్టుకోకుండా సొంతంగా పోటీ చేసి వారి సత్తా ఏంటో చాటుకోవాలి.. అంతేకానీ మిగతా పార్టీలను అడ్డుగా పెట్టుకొని పోటీ చేస్తే మాత్రం క్రెడిట్ అంతా ఆ పార్టీలకే వెళ్ళిపోతుంది. దీనికి తోడు అపోజిట్ ఉన్న పార్టీలు తప్పకుండా గెలుస్తాయి. ఎందుకంటే ఆ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ సెంటిమెంటును రాజేసి  మిగతా పార్టీలకు లాభం జరుగుతుంది. మరి దీనిపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: