కోలీవుడ్ హీరో ,MNM పార్టీ అధినేత కమలహాసన్ ఇటీవలే రాజ్యసభ సభ్యుడుగా కూడా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో అభిమానులు కూడా ప్రత్యేకించి మరి శుభాకాంక్షలు తెలియజేశారు. కమలహాసన్ మాతృభాషా ఆయన తమిళంలోనే ప్రమాణస్వీకారం చేశారు.తమిళనాడులో 2019 సార్వత్రిక ఎన్నికలలో కమల్ హాసన్ పోటీ చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయారు. గత లోక్సభ ఎన్నికలలో DMK పార్టీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగానే ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

దీని తర్వాత కమలహాసన్ చాలా ప్రాంతాలలో చురుకుగా పాల్గొంటూ పలు రకాల కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అలా తమిళనాడులో జరిగిన ఒక కార్యక్రమంలో కమలహాసన్ గెస్ట్గా వచ్చారు.. అక్కడ కమలహాసన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. కమలహాసన్ మాట్లాడుతూ నియంతృత్వం మరియు సనాతన సంఖ్యలను బద్దలు కొట్ట గలిగే ఏకైక ఆయుధం ఏదైనా ఉందంటే అది విద్య మాత్రమేనని.. మరి ఏదైనా మీ చేతులలోకి తీసుకోకండి కేవలం విద్యతో మాత్రమే అది సాధ్యమవుతుంది అది లేకపోతే మనం గెలవలేము.. అందుకే ప్రతి ఒక్కరు బాగా చదవాలి అంటూ తెలియజేశారు కమలహాసన్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ అయితే ఇప్పుడు వైరల్ గా మారుతున్నది.


గత కొంతకాలంగా తమిళనాడులో భాషా వివాదం ఎక్కువగా వినిపిస్తోంది. కమలహాసన్ పార్టీ పెట్టక ముందే హిందుత్వానికి కొంతమేరకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తమిళనాడు అధికార పార్టీ లో భాగం కావడం చేత కమలహాసన్ సనాతన ధర్మం పైన కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి ఈ విషయంపై పలువురు నెటిజన్స్ భిన్నాభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నారు. ఇక సినిమాలో విషయంలో కూడా కమలహాసన్ కొత్త సినిమాలను ఏవి కూడా ఒప్పుకోవడం లేదనే విధంగా వినిపిస్తున్నాయి రాబోయే రోజుల్లో ప్రస్తుతం ఉన్న సినిమాలను పూర్తి చేసి సినిమాలకు దూరం అయ్యే ఆలోచనలో ఉన్నట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: