ఇటీవలే ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహ. హోంభలే ఫిలిమ్స్ బ్యానర్ పైన ఈ చిత్రం తెరకెక్కించారు. డైరెక్టర్ అశ్విన్ కుమార్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించగా జులై 25న థియేటర్లలో విడుదల అయ్యింది.అలా విడుదలైన మరుసటి రోజు నుంచి ఈ సినిమాకు భారీగా రెస్పాన్స్ లభించింది. తెలుగులో ఈ చిత్రాన్ని గీత ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయగా భారీ లాభాలు అందుకున్నట్లు సమాచారం. యానిమేషన్ సినిమా అయినప్పటికీ భక్తి సినిమా అయిన చాలా పవర్ఫుల్ కమర్షియల్ గా చూపించారు.


సినిమా చివరి అరగంట అయితే ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకులను అబ్బురపరిచేలా ఉన్నది. సైలెంట్ గా విడుదలైన ఈ మహావతార్ సినిమా రెండవ రోజు నుంచి భారీ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా థియేటర్ల సంఖ్య పెంచాలని అడుగుతూ ఉన్నారు. ఈ సినిమాకు తెలుగులో కూడా సక్సెస్ మీట్ ను నిర్వహించడం జరిగింది. మహావతార్ నరసింహ సినిమా కేవలం రూ .6 కోట్లతో తెరకెక్కించగా ఈ సినిమాకి ఇప్పటికే రూ.105 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.


ఈ కలెక్షన్స్ తో అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టి రూ .100 కోట్లు రాబట్టిన మొట్టమొదటి ఇండియన్ యానిమేటెడ్ చిత్రంగా మహావతార్ సినిమా సరికొత్త రికార్డులను తిరగ రాస్తుంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. బడా హీరోల చిత్రాలు విడుదలైయినప్పటికీ మహావతార్ నరసింహ సినిమాకి అంతకుమించి టాక్ వినిపిస్తోంది. చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లే సమయాలలో చెప్పులు బయట విడిచి వెళ్లడమే కాకుండా లోపల పూజలు కూడా చేస్తూ ఉన్నారు. అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మహావతార్ సీక్వెల్స్  2037 వరకు కూడా ఉండబోతున్నట్లు హోంభలే బ్యానర్స్ వారు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: