
పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ నేను పోలవరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని నా ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమంది నాపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రయత్నాలు ఫలించవని ఆయన చెప్పుకొచ్చారు. గిరుపుత్రుడైన తాను అవినీతికి ఎన్నడూ పాల్పడలేదని చిర్రి బాలరాజు వెల్లడించారు. భవిష్యత్తులో కూడా నేను అవినీతికి పాల్పడబోనని ఆయన పేర్కొన్నారు.
నా నుంచి ఆర్ధిక లబ్ధిని ఆశించి అందుకు నేను నిరాకరించడం వల్ల నాపై బురద జల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో నా గురించి అసత్య ఆరోపణలు చేసిన వాళ్లపై నేను పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. ఈ విషయం నా నియోజకవర్గ ప్రజలకు సైతం తెలుసని ఆయన పేర్కొన్నారు. నేను 100 కోట్ల రూపాయలు ఆర్జించానని ప్రచారం చేసిన మీడియా సంస్థలపై కూడా కేసు వేయాలని ఫీలవుతున్నానని తెలిపారు.
ఇది జనసేన పార్టీపై జరుగుతున్న కుట్ర అని ఆయన చెప్పుకొచ్చారు. నాపై జరుగుతున్న అసత్య ప్రచారం గురించి పవన్ కు నివేదిక ఇస్తానని తెలిపారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. అసలు 100 కోట్ల రూపాయల అవినీతి చేయడం ఎలా సాధ్యం అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన నేత రియాక్షన్ నేపథ్యంలో ఆరోపణలు చేసిన నేతలు సైలెంట్ అవుతారో లేక ఏమైనా చేస్తారో చూడాల్సి ఉంది.