చాలామంది నేతలు  తమ వ్యక్తిగత విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీంతో కొన్ని వ్యక్తిగత విషయాలు బయటపడడంతో ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన ఒక ఎమ్మెల్యే ఒక మహిళతో మాట్లాడుతున్న ఒక వీడియో సంచలనంగా మారింది. అయితే ఈ వీడియోకు ఎటువంటి సౌండ్ లేదు.. కాని కేవలం సైగలు చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు మాత్రమే కనిపిస్తోంది. ఈ వీడియోని వైసీపీ సోషల్ మీడియా మరింత వైరల్ గా చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.


అసలు విషయంలోకి వెళ్తే గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ ఈ వీడియోలో ఉన్నది.. ఈ ఎమ్మెల్యే తన ఇంట్లోనే ఉండగా ఒక మహిళతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది.కానీ ఎటువంటి సౌండ్ లేదు.. కానీ ఆ మహిళ ఎవరు ఎమ్మెల్యేతో వీడియో కాల్ సంభాషణలు ఏం మాట్లాడిందని విషయం క్లారిటీ లేదు.. కానీ కొంతమంది మాత్రం గతంలో టిడిపి పార్టీ నుంచి కార్పోరేటర్ గా పోటీ చేసిన మహిళ అంటూ కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు.


కొంతమంది టిడిపి కార్యకర్తలు, నేతలు ఈ వీడియో కావాలనే ఇలా వైరల్ చేస్తున్నారు.ఇది ఫేక్ వీడియో అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి సంఘటనలను ఎక్కువగా వైసీపీ పార్టీ టార్గెట్ చేస్తూ వైరల్ గా చేస్తున్నారు. ఎమ్మెల్యేల వ్యక్తిగత విషయాల పైన కూడా ఎక్కువగా వైసిపి పార్టీ నిఘా పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే చాలామంది నేతలు ప్రైవేటు వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇవన్నీ కూడా వారి యొక్క రాజకీయ జీవితానికి చాలా మచ్చగా మారుతున్నాయి. మరి ఇటువంటి విషయాలపైన పార్టీ హై కమాండ్ ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో అయితే వైరల్ గా మారుతోంది .మరి ఈ విషయంపై ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఎలా క్లారిటీ ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: