తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపెడుతుంది. ఇప్పటికే తన పెళ్లి గురించి ఓ షాకింగ్ మేటర్ కూడా మాట్లాడింది. నేను ఒకరిద్దరితో కనీసం కలిసింది ఒక సారే.కానీ వారితో నాకు పెళ్లిళ్లు చేసేసారు.అలా విరాట్ కోహ్లీ నేను కలిసింది ఒకేసారి ఒక యాడ్ కోసం కలిశాం.కానీ ఆయనతో పెళ్లి చేశారు. విరాట్ ని ఇప్పటివరకు నేను మళ్ళీ కలవలేదు. అలాగే క్రికెటర్ అబ్దుల్ రజాక్ తో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ టైం లో కలిశాను.ఆయనతో కూడా పెళ్లి చేసేసారు అంటూ వాపోయింది.అలాగే తమన్నా నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో బాహుబలి సినిమా ముందుంటుంది. అయితే ఈ సినిమా పార్ట్1 లో యుద్ధం చేసే అమ్మాయిగా తమన్నా కనిపిస్తుంది.అయితే ఇందులో తమన్నా మీద ఇష్టంతో ప్రభాస్ ఆమె వెంట పడుతుంటాడు.కానీ తమన్నా మాత్రం ప్రభాస్ పై దాడి చేస్తుంది. 

ఆ సమయంలో ప్రభాస్ తమన్నా లో ఉన్న ఆడతనాన్ని బయటకు తీయడం కోసం ఆమె ని అచ్చమైన అమ్మాయిలాగా రెడీ చేయాలని ఆమె బట్టలు విప్పేస్తూ,కళ్ళకు కాటుక పెడుతూ, పెదవులకు లిప్స్టిక్,జుట్టు విరబోసి ఇలా అచ్చ తెలుగు అమ్మాయిలాగా కనిపించేలాగా చూపిస్తాడు. ఇక అదే సమయంలో పచ్చబొట్టేసిన అనే సాంగ్ వస్తుంది. ఈ సాంగ్ చివర్లో వీరిద్దరి మధ్య రొమాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే బాహుబలి కి పచ్చబొట్టేసిన సాంగ్ వచ్చిన సమయంలో ప్రభాస్ తమన్నా పై రేప్ అటెంప్ట్ చేశాడు అంటూ పెద్ద ఎత్తున నెగిటివిటీ సినిమాపై వచ్చింది.అయితే అప్పుడు వచ్చిన ఈ నెగెటివిటీపై తాజాగా తమన్నా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. డైరెక్టర్ ఒక విషయం చూపిస్తే మీరు మరో విషయం అర్థం చేసుకుంటారు.ఎవరెలా  అర్థం చేసుకుంటారో వారికి అలాగే అర్థం అవుతుంది .

కానీ డైరెక్టర్ అక్కడ చూపించాలనుకుంది మీరు అనుకుంది అయితే కాదు.ఒక పురుషుడు నాలోని మహిళత్వాన్ని చూపించడం కోసం క్రియేట్ చేసిన సీన్ అది. కానీ కొంతమంది మాత్రం దాన్ని వేరే దృష్టితో చూసారు. అందుకే వాళ్లకు అలా అర్థమైంది. అయితే ఈ సీన్ గురించి ఎవరైతే చెడుగా అర్థం చేసుకున్నారో వారు నా శరీరాన్ని కూడా అదే కోణంలో చూశారని నేను అర్థం చేసుకుంటాను. ఒక సినిమా నిర్మాత మిమ్మల్ని అందంగా చూపించాలి అనుకుంటారు. కానీ మీరు దాన్ని వేరే కోణంలో అర్థం చేసుకుంటారు. దానికి నేనేం చేయగలను. ఎవరి ఆలోచన దృక్పథం వారిది. అలాంటి వారిని నేను అస్సలు పట్టించుకోను అంటూ తమన్నా చెప్పుకొచ్చింది. అయితే బాహుబలి పార్ట్ 1 విడుదలైన సమయంలో 'ది రేప్ ఆఫ్ అవంతిక' అంటూ టైటిల్స్ తో పెద్ద ఎత్తున నెగెటివిటీ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: