
మహిళల ప్రయాణం కోసం 6700 బస్సులు కేటాయించామని ఈ పథకం అమలు కోసం 1950 కోట్ల రూపాయలు ఖర్చు అవుతోందని ఆయన చెప్పుకొచ్చారు. మంత్రి చేసిన ప్రకటన మహిళల సంతోషానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమవుతుందని చెప్పవచ్చు. ఏపీ సర్కార్ తీసుకున్న మరో కీలక నిర్ణయం ప్రజలకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చేసిన ప్రకటనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఈ పథకం అమలు కానుంది. రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికయినా జీరో టికెటింగ్ విధానం అమలు కానుందని మంత్రి తెలిపారు. ఈ స్కీమ్ అమలుకు ప్రభుత్వం సంసిధ్దంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. కర్నాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో పర్యటించి అక్కడ ఈ స్కీమ్ ఎలా అమలవుతుందో తెలుసుకున్నామని ఆయన కామెంట్లు చేశారు.
ప్రభుత్వం ఏర్పాటుకు ముందు మహిళల్లో ఎక్కువమంది ఈ పథకానికి ఓకే చెప్పారని ఆయన అన్నారు. నే రాష్ట్రంలోని మహిళలకు అందరికి ప్రీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి అన్నారు. ఏపీ ఫ్రీ బస్ స్కీమ్ మార్గదర్శకాలు జారీ కావడంతో పాటు ఈ పథకానికి సంబంధించిన ఎన్నో సందేహాలకు సులువుగా చెక్ పెట్టారని చెప్పవచ్చు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు