హిందువులు శబరిమల అయ్యప్ప స్వామిని ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తూ ఉంటారు. అలాంటి శబరిమల అయ్యప్ప దేవాలయంలో ఒక ఘోరమైన అపచారం జరిగినట్లుగా ఒక వీడియో వైరల్ గా మారుతోంది. ఈ వీడియోలో నిరపుతరి మహోత్సవం సందర్భంగా పతినిట్టంపడి పై పోలీస్ అధికారి అగౌరవంగ ప్రవర్తిస్తున్నట్లుగా ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో వైరల్ కావడం చేత అయ్యప్ప భక్తులు, హిందువులు సైతం అధికారి పైన ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు. జూలై 30 వ తేదీన శబరిమలలో ఈ సంఘటన జరగక ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


దేశవ్యాప్తంగా ఎంతో మంది భక్తుల అసహనానికి ఈ వీడియో కారణంగా మారింది. ఒక పోలీస్ అధికారి పవిత్రమైనటువంటి పతినెట్టంపడి పై  ఇలా నిలబడడం అలాగే మరొక అధికారితో కూడా మాట్లాడుతూ తన పాదాన్ని వాటిపైన రుద్దుతూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయ్యప్ప స్వామిని ఎంతో భక్తితో పూజించే భక్తులు 18 మెట్ల పైన నడవడం కూడా చాలా పవిత్రంగా భావిస్తూ ఉండే భక్తులకు పోలీస్ అధికారి చేసిన ఈ పని తీవ్ర బాధను కలిగిస్తోందని తెలియజేస్తున్నారు.



పవిత్రమైన 18 మెట్ల పైన నిలబడి మరొక అధికారితో మాట్లాడుతూ ఉండడమే కాకుండా అక్కడ కాలు రుద్దుతూ ఉండడంతో ఈ అధికారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలని హిందువుల సైతం డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు తిరిగి మళ్లీ జరగకుండా శబరిమల ఆలయ పవిత్రతను కాపాడాలి అంటూ భక్తులు సైతం విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక గత ఏడాది పోలీసు అధికారులు పవిత్రమైనటువంటి పులి, ఏనుగు విగ్రహాలను కూడా కుల్చారని.. ఇప్పుడు పతినెట్టంపడి ని ఫోటోలో స్పాట్ గా మార్చుకున్నట్లుగా వినిపిస్తున్నాయి. దీంతో ఈ వీడియో వైరల్ గా మారడంతో మరి అధికారులు ఈ విషయం పైన ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. ప్రస్తుతం అయితే ఈ వీడియో సంచలనంగా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: