టాలీవుడ్ ఇండస్ట్రీకి సమ్మె సైరన్ వల్ల ఊహించని షాక్ తగిలింది. ఫిలిం ఛాంబర్ డిమాండ్లకు అంగీకరించకపోవడం వల్ల తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సమ్మెకు పిలుపునివ్వగా టాలీవుడ్ ఇండస్ట్రీలో షూటింగ్స్ నిలిచిపోయాయనే సంగతి తెలిసిందే. అయితే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాత్రం మనం కనీస వేతనాల కంటే ఎక్కువ చెల్లిస్తున్నామని ఫెడరేషన్ పక్షపాతంగా తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నామని పేర్కొంది.

మెరుగైన భవిష్యత్తు, శాశ్వత పరిష్కారం కోసం మనమంతా ఐక్యతతో ఉండాలని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేర్కొంది. అయితే ఈ ప్రభావం తొలి  దెబ్బ అల్లరి నరేష్ పై పడింది. హాస్య మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న అల్లరి నరేష్ 65వ మూవీపై ఈ ప్రభావం పడింది. సమ్మె కారణంగా ఈ కార్యక్రమం రద్దయింది.

సమ్మెను విరమించి, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని ఇరు పక్షాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు జోక్యం చేసుకొని మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, కార్మికులు తమ డిమాండ్లపై  పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది.  ఈ సమ్మె వల్ల ప్రతిరోజూ కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది.

కేవలం నిర్మాతలు మాత్రమే కాదు, థియేటర్ల యజమానులు, పంపిణీదారులు, సినిమాపై ఆధారపడి జీవనం సాగిస్తున్న అనేకమంది కార్మికులు కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. ఈ ప్రతిష్టంభన త్వరగా ముగిసి, టాలీవుడ్‌లో మళ్లీ సందడి వాతావరణం నెలకొనాలని ఆశిద్దాం. అల్లరి నరేష్ కొత్త సినిమాకు రంభ ఊర్వశి మేనక అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: