ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం పాన్ ఇండియా పాట పాడుతోంది. ఆ స్థాయిలో కథ లేకపోయినా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తూ బొక్క బోర్లా పడుతున్నారు.. చాలామంది దర్శక నిర్మాతలు నష్టాల పాలవుతున్నారు. ఇదంతా పక్కన పెడితే సినిమా కోసం పనిచేసే చిన్నాచితకా ఉద్యోగులంతా  వారికి ఇచ్చే వేతనాల్లో 30% పెంచి ఇవ్వాలని షూటింగ్స్ అన్ని బంద్ చేశారు. ముఖ్యంగా తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఫెడరేషన్ నాయకులు పెంచిన వేతనాలు కూడా ఏ రోజుకు ఆ రోజే ఇవ్వాలని డిమాండ్ చేశారు.. ఇదే తరుణంలో సోషల్ మీడియా వేదికగా పలు వార్తలు  హీరోలను విమర్శిస్తూ వస్తున్నాయి.. ఒక్కొక్క హీరో 100 నుంచి 200 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు. నటన అంటే తెలియని కొంతమంది వ్యక్తులు కూడా దర్శక నిర్మాతలు, సంగీత దర్శకులు అందరూ ఇదే కోవలోకి వస్తున్నారు. 

అలాంటి వాళ్ళని అద్భుతంగా తెరపై చూపించే దిగువ స్తాయి ఆర్టిస్టులు, 24 క్రాఫ్ట్ లో ఉన్న వాళ్లకు మాత్రం నాలుగు రూపాయలు పెంచమంటే చచ్చిపోతున్నారు. అసలు ఆ సినిమాలో కంటెంట్ లేకున్నా ఆ హీరోకు అంత టాలెంట్ లేకుండా వందల కోట్లు ఇస్తూ కిందిస్థాయిలో పనిచేసి ఎంతో కష్టపడే వాళ్లకు కనీసం నాలుగు రూపాయలు పెంచమంటే తర్జనా భర్జనా పడుతున్నారు. ఆ హీరోలకి ఇచ్చే దాంట్లో కనీసం ఒక 5% తగ్గిస్తే  వీళ్ళు అడిగిన 30% కాదు 60% డబ్బులు ఇవ్వచ్చు. చిన్నాచితకా ఆర్టిస్టులు ఎందరో ఇబ్బందులు పడుతున్నా కానీ ఆ హీరోల కాళ్లు నాకుతూ దర్శకనిర్మాతలు వాళ్ళ వెంబడే తిరుగుతున్నారు. ఏ ఒక్క హీరో, బోల్డ్ సీన్,బోల్డ్ హీరోయిన్,వెక్కిలి కథలు వెక్కిలి వేషాలు లేకుండానే కొన్ని సినిమాలు తీస్తున్నారు. దానికి ఉదాహరణ ఇదే.ఈ మధ్యకాలంలో ఆహా, హోంబలే ఫిలిమ్స్ సంస్థల వారు జస్ట్ కొన్ని కోట్ల రూపాయలతోనే సినిమాలు చేసి అద్భుతమైన గ్రాఫిక్స్ వాడి యానిమేటెడ్ మూవీ తీశారు. బడ్జెట్ 20 కోట్లు కూడా దాట లేదు.

 కే జి ఎఫ్,కాంతారా వంటి సినిమాలు ఎలాంటి హిట్ అందుకున్నాయో మనందరికీ తెలుసు.. అలాంటి ఈ తరుణంలో మన తెలుగు సినిమాల్లో మాత్రం వందలాది కోట్ల రూపాయల బడ్జెట్  ఖర్చవుతుంది. మరి ఈ సినిమాలు హిట్ కొడుతున్నాయా అంటే అందులో 90 శాతం ప్లాప్ అవుతున్నాయి. దీనికి తోడు అడ్డగోలుగా టికెట్ రేట్లను పెంచుతూ  సాధారణ జనాలను ఇబ్బంది పెడుతున్నారు.. ఇంత కష్టం చేస్తున్న నిర్మాతలు కింది స్థాయిలో పనిచేసే ఆర్టిస్టులు ఇతర వ్యక్తులకు మాత్రం శాలరీలు పెంచమంటే  మొహం చాటేస్తున్నారు.. ఇప్పటికైనా ఈ నిర్మాతలు ఆలోచన చేసి అన్ని వందల కోట్ల ఖర్చు చేసే కంటే ఒక అద్భుతమైన సినిమాకు తక్కువ ఖర్చుతో తీయండి. దీనివల్ల కొత్త వాళ్లకు అవకాశం దొరుకుతుంది, కింది స్థాయిలో పనిచేసే వాళ్లకు కూడా ఉపాధి దొరుకుతుందని అంటున్నారు.. దీనిపై కాస్త ఆలోచన చేసి  తెలుగు ఫిలిం ఫెడరేషన్ నాయకుల డిమాండ్స్ నెరవేర్చాలని విశ్లేషకులు  కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: