
ముంబై నుంచి సినీ కార్మికులను రంగంలోకి దింపిన నిర్మాతలు ఇప్పటికే షూటింగ్ పనులను మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయం విషయంలో తెలుగు కార్మికులు ఫైర్ అవుతున్నారు. తమ సమస్యలపై చర్చించకుండా ఇలా చేయడం ఏంటని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కనీసం పవన్ కళ్యాణ్ అయినా న్యాయం చేయాల్సిన అవసరం అయితే ఉందని అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
అయితే తెలుగు ఫిలిం ఛాంబర్ మాత్రం 5 శాతం వేతనాల పెంపునకు సానుకూలంగా ఉంది. 30 శాతం వేతనాల పెంపును ఫిలిం ఛాంబర్ ఖండించడంతో పాటు ఫెడరేషన్ పై సీరియస్ అయింది. కనీస వేతనాలతో పోల్చి చూస్తే తాము ఎక్కువ మొత్తమే చెల్లిస్తున్నామని వెల్లడించింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడతాయేమో చూడాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
సమ్మె సైరన్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని పెద్ద సినిమాలపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతోందని తెలుస్తోంది. చిరంజీవి అనిల్ కాంబో మూవీ, అఖండ2, ది రాజాసాబ్, రామ్ మూవీ, సంబరాల ఏటిగట్టు, తెలుసు కదా, మిరాయ్, డెకాయిట్ సినిమాలపై కూడా ఈ ప్రభావం పడుతోందని తెలుస్తోంది. సమ్మె సైరన్ ఎన్ని రోజుల పాటు కొనసాగుతుందో చూడాల్సి ఉంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు