
తన కుటుంబ వ్యాపారాలలో వస్తున్న ఆదాయానికి అవినీతి సొమ్మును పాలు నీళ్లలా జత చేస్తున్నారట. గుంటూరు జిల్లాలోని రాజధానికి ఆనుకొని ఉన్న నియోజవర్గాని తన సొంత సామ్రాజ్యంగా మార్చుకున్నారు.. ఒక ఏడాది నుంచి ల్యాండ్ కన్వర్షన్ అనుమతులకి చెక్ పెట్టారు.. రిజిస్ట్రేషన్ రెవెన్యూ అధికారులను కూడా బెదిరిస్తున్నారట.. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు తిప్పలు పెట్టిస్తున్నారు ఆ టిడిపి నేత. దళారులను పెట్టి బెదిరిస్తున్నారని ఎవరైనా వెంచర్ వేసుకుంటే వాటాల అడుగుతున్నారట ఆ టిడిపి ఎమ్మెల్యే.
భూమి అమ్మిన ఏం చేసిన..ఎకరానికి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట టిడిపి నేత. ఒకవేళ ఇవ్వకపోతే అనుమతులు రాకుండా అడ్డుపడుతున్నారట. ఇందులో సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా వారి యొక్క సొంత వ్యాపారాలను కూడా ఆపుతున్నారట. ఈ దందాతో టిడిపి నేత కి సంబంధించి ఒక న్యూస్ ఇప్పుడు ఏపీలో సర్కులేట్ అవుతోంది. అయితే గత వైసిపి ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ లకు సంబంధించి ఎక్కడా ఇలా జరిగేది కాదని చాలా శుభ్రంగానే రియల్ ఎస్టేట్ జరిగిందని విధంగా రాసుకొచ్చారు.. కానీ ఈ సీనియర్ నేత చేస్తున్న ఆగడాలు చూసి అక్కడ వారంతా భయపడుతున్నారు అంటూ కూటమి ప్రభుత్వానికి అనుకూల మీడియాలోనే ఈ విషయాన్ని రాసుకొచ్చారు. ఆ సీనియర్ ఎమ్మెల్యే పేరు మాత్రం రాయలేదు.