
జిల్లాల విభజనలో గత ప్రభుత్వం చేపట్టిన నిర్ణయంతో విశాఖ జిల్లాలోని ఒక నియోజకవర్గంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విశాఖ జిల్లా పునర్విభజలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలోకి మారింది. దీంతో పరిపాలనపరంగా స్పష్టత లేకుండా పోయింది. రాష్ట్రంలో పెందుర్తి తో పాటు కొన్ని నియోజకవర్గాలలో ఇలాంటి సమస్య ఉంది. తాజాగా కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో సమస్యలపై మంత్రివర్గ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి పెందుర్తి నియోజకవర్గ తెరమీదకు వచ్చింది. పెందుర్తి నియోజకవర్గంలో పెందుర్తి - సబ్బవరం - పరవాడ మండలాల పూర్తిగా .. పెదగంటియాడ మండలం కొంత భాగం ఉంది. గత ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనలో ముందు పెందుర్తి నియోజకవర్గం అనకాపల్లి జిల్లాలో చేర్చారు.
వ్యతిరేకత రావడంతో పెందుర్తి మండలాన్ని విశాఖలో కొనసాగించారు. దీంతో పాటు పెదగంట్యాడ మండలం కూడా విశాఖలో ఉంది. సబ్బవరం - పరవాడ మండలాలను అనకాపల్లి జిల్లాలో చేర్చారు. నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలో ఉండడంతో పాలనాపరమైన ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నియోజకవర్గానికి ఇద్దరు కలెక్టర్లు ఉన్నారు. ఎమ్మెల్యే జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించాలన్న .. సమాచారం తీసుకోవాలన్న వేరువేరుగా సేకరించాల్సిన పరిస్థితి. రెండు జిల్లాల అధికారులతో వేరువేరుగా సమీక్షలు చేస్తున్నారు. దీంతో చాలా ఇబ్బంది ఉంది. పెందుర్తి నియోజకవర్గం ముందు నుంచి విశాఖ నగరంతో అనుబంధం కలిగి ఉంది. దీంతో ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా విశాఖ జిల్లాలోకి మార్చాలని మరోసారి డిమాండ్ చేస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు