ఏపీ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతూనే ఉన్నాయి. ఓవైపు అధికార పార్టీ ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి బాటలో నడిపించడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే మరోవైపు ప్రతిపక్షాలు అధికార పార్టీపై బురద జల్లుతూనే ఉంటాయి.అయితే ఏ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా అధికార పక్షం వారికి ప్రతిపక్షాలు ఎప్పుడూ ధీటుగా సమాధానాలు ఇస్తూ వారిని క్వశ్చన్ చేస్తూనే ఉంటాయి.అలా ఏపీలో కూడా ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షం ఏంటంటే వైసిపి పార్టీ మాత్రమే. ఇక కాంగ్రెస్ ఉన్నప్పటికీ వైసిపి టిడిపి మధ్యే ఎక్కువ పోటీతత్వం అనేది ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సీనియర్ ఎన్టీఆర్ రెండో భార్య అయినటువంటి లక్ష్మీపార్వతి చంద్రబాబు లోకేష్ ల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. సీనియర్ ఎన్టీఆర్ చనిపోయాక లక్ష్మీపార్వతికి నందమూరి ఫ్యామిలీకి మధ్య ఉప్పు నిప్పులా తయారైపోయింది.

ముఖ్యంగా తన భర్తని వెన్నుపోటు పొడిచి టిడిపి పార్టీని చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారని లక్ష్మి పార్వతి ప్రతిసారీ ఆరోపిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు,మంత్రి లోకేష్ లపై సంచలన వ్యాఖ్యలు చేసింది లక్ష్మీపార్వతి. ఆమె తాజాగా ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. సీఎం సీటు కోసం ప్రస్తుతం తండ్రీ కొడుకుల మధ్య ఒక యుద్ధ వాతావరణమే నడుస్తోంది. చంద్రబాబుకి లోకేష్ కి మధ్య సీఎం పదవి కోసం గొడవలు జరుగుతున్నాయి.ఎన్నోసార్లు మీరు సీఎం సీట్లో కూర్చొని రాష్ట్రాన్ని పాలించారు. ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అంటూ లోకేష్ చంద్రబాబు నాయుడి తో గొడవ పెట్టుకుంటున్నారు.అందుకే ఈ గొడవలు మరింత తీవ్రతరం కాకూడదని చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా కూడా లోకేష్ ని పొగుడుతూ కొడుకు కోపం చల్లారేలా చేస్తున్నారు.. అసలు సరైన చదువులు రాని లోకేష్ ని మంత్రిగా చేశారు.

ఆయన అవినీతిపరుడిగా మారాడు. ఇక ఈ తండ్రి కొడుకులు రాష్ట్రంపై దోచుకుతిన్న సొమ్మంతా తీసుకువెళ్లి సింగపూర్ లో దాచుకుంటున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది లక్ష్మీపార్వతి. ప్రస్తుతం లక్ష్మీపార్వతి వైసీపీ పార్టీలో ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఈ నేపథ్యంలోనే సమయం దొరికినప్పుడల్లా చంద్రబాబుపై షాకింగ్ కామెంట్లు చేస్తూనే ఉంటుంది. అయితే అన్నీ ఒకెత్తయితే లక్ష్మీపార్వతి ఇప్పటివరకు మాట్లాడిన మాటలు అయితే ఇప్పుడు సీఎం సీటు కోసం చంద్రబాబు లోకేష్ లు గొడవ పడుతున్నారు అని మాట్లాడం మరో ఎత్తు అయింది. కానీ లక్ష్మీపార్వతి చేసిన ఆరోపణలపై టిడిపి కార్యకర్తలు,అభిమానులు నవ్వుకుంటున్నారు. తండ్రి కొడుకుల మధ్య సీఎం సీటు కోసం గొడవలా.. ఏవైనా ఆరోపణలు చేస్తే నమ్మేటట్లు కనిపించాలి. కానీ లక్ష్మీపార్వతి చేసిన ఆరోపణలు మాత్రం నవ్వు పుట్టిస్తున్నాయి అంటూ మాట్లాడుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: