మంచు విష్ణు.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హ్యూజ్ పాజిటివ్ కామెంట్స్ దక్కించుకున్న పేరు . సాధారణంగా మంచు ఫ్యామిలీ హీరోస్ ని సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ చేస్తూ ఉంటారు . దానికి రీజన్ఏంటో తెలియదు కానీ చాలామంది ఇలానే చేస్తూ ఉంటారు.  అయితే కన్నప్ప సినిమాతో దానికి బ్రేక్ పెట్టేసాడు మంచు విష్ణు . కన్నప్ప సినిమాను తనదైన స్టైల్ లో మొత్తం సెట్ చేసి గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ చేసి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో పడేలా ప్లాన్ చేసుకున్నారు . అయితే అన్ని బాగానే ఉన్నా కన్నప్ప సినిమా అనుకున్నంత హిట్ కాలేకపోయింది .


మరి ముఖ్యంగా కలెక్షన్స్ పరంగా అంతా మంచిగా కలెక్ట్ చేయలేకపోయింది.  అయితే కన్నప్ప సినిమా ప్రమోషన్స్ చాలా చక్కగా ప్లాన్ చేసిన మంచు విష్ణు..కన్నప్ప రిలీజ్ అయిన తర్వాత అసలు కనిపించడమే మానేశారు . దీంతో మంచు విష్ణు వేరే ప్రాజెక్టులో బిజీబిజీగా ఉండిపోయాడు అని అంతా అనుకున్నారు . అయితే రీసెంట్ గా మంచు విష్ణు మోహన్ బాబు యూనివర్సిటీ స్నాతకోత్సవంలో సందడి చేశారు . ఈ సందర్భంగా డ్రమ్స్ కళాకారుడు శివమణి మీడియా ఫీల్డ్ కు చెందిన విజయ్ కు ప్రకటించిన డాక్టరేట్ ని పెద్దల సమక్షంలో అందజేశారు .



అయితే ఈ సమయంలో ఆయన దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి . అసలు ఇక్కడ చూస్తున్నది మంచు విష్ణు నేనా ..? అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు అంత సన్నగా అయిపోయాడు..? బక్క చిక్కినట్లు మారిపోయాడు..? ఎంతో చలాకిగా బొద్దుగా యాక్టివ్ గా కనిపించే ఆయన .. ఈ ఫోటోలలో మాత్రం చాలా నీరసంగా కనిపించినట్లు జనాలు మాట్లాడుతున్నారు . ఏదైనా అనారోగ్యమా..? లేకపోతే సినిమా కోసం బరువు తగ్గుతున్నాడా..? అనే విధంగా మాట్లాడుకుంటున్నారు . కన్నప్ప హెయిర్ స్టైల్ అలాగే కంటిన్యూ చేస్తున్న విష్ణు ముఖంలో అసలు కల లేకుండా పోయింది. గతంలో బొద్దుగా ఉన్న విష్ణు చాలా చాలా కలగా ఉండేవాడు . ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయాడు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు..??

మరింత సమాచారం తెలుసుకోండి: