సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ల కెరియర్గా కేరిర్ను కొనసాగిస్తున్న కొంత మంది కేవలం సినిమాల్లో నటించి డబ్బులను వెనకేసుకోవడం మాత్రమే కాకుండా అనేక బిజినెస్ లను చేస్తూ కూడా బాగానే డబ్బులను సంపాదిస్తున్నారు. అలాగే కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా బిజినెస్ లలో కూడా అద్భుతమైన రీతిలో చాలా మంది సక్సెస్ అవుతున్నారు. ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ లో క్రేజ్ కలిగిన నటీమణులలో తమన్నా ఒకరు. ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న దాదాపు ఈ తరం స్టార్ హీరోల అందరితో ఈమె నటించింది. తమన్నా ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈమె చాలా కాలం పాటు తెలుగులో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించింది. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు. కానీ తమన్నా మాత్రం అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని యూస్ చేసుకుంటూ అద్భుతమైన రీతిలో కెరియర్ను ముందుకు సాగిస్తుంది. కెరియర్ బిగినింగ్ నుండి కూడా తమన్నా సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేస్తూ వస్తుంది. ఇప్పటివరకు ఈమె ఎన్నో ఐటమ్ సాంగ్స్ చేసి తన అందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మధ్య కాలంలో కూడా తమన్నా ఎక్కువ శాతం ఐటమ్ సాంగ్స్ చేస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ జ్యూవెలరీ బిజినెస్ లో కొనసాగుతుంది.

ఇక ఈ బ్యూటీ మరో కొత్త బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన చిన్న హింట్ ఇస్తూ ఈమె కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. మరి ఈమె ఎలాంటి బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అనేది మరికొద్ది రోజుల్లోనే క్లారిటీగా తెలిసే అవకాశం ఉంది. తమన్నా అభిమానులు మాత్రం కచ్చితంగా తమన్నా అదిరిపోయే రేంజ్ లో ఇన్కమ్ వచ్చే బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తుంది. దాని ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులను సంపాదిస్తుంది అని గట్టిగా నమ్ముతున్నారు. మరి తమన్నా ఎలాంటి బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: