తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో గౌతమ్ తిన్ననూరి ఒకరు. ఈయన సుమంత్ హీరో గా రూపొందిన మళ్లీ రావా అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తో గౌతమ్ దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈయన నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా జెర్సీ అనే మూవీ ని రూపొందించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. అలాగే ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఇక ఈ సినిమాతో గౌతమ్ పెరిగిపోయింది. ఇకపోతే కొంత కాలం క్రితం రామ్ చరణ్ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ మూవీ రూపొందనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. దానితో వీరిద్దరి కాంబోలో మూవీ కన్ఫామ్ అని చాలా మంది అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ కాంబో మూవీ క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా గౌతంమ్ "కింగ్డమ్" అనే సినిమాను రూపొందించాడు. ఆ మూవీ తాజాగా విడుదల అయ్యి విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది.

తాజాగా గౌతమ్ , రామ్ చరణ్ తో మూవీ ఎందుకు క్యాన్సల్ అయింది అనే దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా గౌతమ్ మాట్లాడుతూ ... రామ్ చరణ్ గారికి ఓ పాయింట్ చెప్పాను. అది ఆయనకు చాలా బాగా నచ్చింది. దానితో దానిని డెవలప్ చేశాను. అయితే అది రామ్ చరణ్ కు సూట్ అవ్వదు అని నేనే భావించాను. రామ్ చరణ్ కి దర్శకత్వ వహించే అవకాశం వచ్చింది. కానీ తొందర పడి ఏది పడితే అది తీయకూడదు అనే ఉద్దేశంతో నేనే చరణ్ తో సినిమా చేయకుండా తప్పుకున్నాను అని గౌతమ్  తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: