
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. ఒకసారి అభిమానులకు నచ్చిన కాంబినేషన్ కనిపిస్తే, ఆపై ఆ జోడీని మరోసారి వెండితెరపై చూడాలని కోరుకుంటారు. అలాంటి ఆసక్తికర కాంబినేషన్‌లలో ఒకటి బాలకృష్ణ – తమన్నా జోడీ కావాలని సినీ జనాలు ఎప్పుడో ఊహించుకున్నారు. కానీ ఇప్పటికీ ఈ కాంబినేషన్ సాధ్యపడలేదు. తమన్నా చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున లాంటి టాలీవుడ్ సీనియర్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. సైరా నరసింహారెడ్డి, ఎఫ్ 3, భోళా శంకర్ ఆమె సీనియర్ హీరోలతో కలిసి నటించిన సినిమాలు. అయితే బాలయ్యతో మాత్రం ఇప్పటికీ ఆమె సినిమా చేయలేదు. భగవంత్ కేసరి షూటింగ్ సమయంలో ఆమె బాలయ్యతో ఐటమ్ సాంగ్ చేయబోతున్నదన్న ప్రచారం వచ్చినా అది నిజం కాలేదు.
నందమూరి హీరోలు - తమన్నా కాంబినేషన్ కలిసి రాలేదనే చెప్పాలి. తమన్నా ఇప్పటివరకు నందమూరి ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలతో సినిమాలు చేసింది. జూనియర్ ఎన్టీఆర్‌తో ఊసరవెల్లి, కళ్యాణ్ రామ్‌తో నా నువ్వే. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిలయ్యాయి. ఊసరవెల్లి టెక్నికల్‌గా పేరు తెచ్చుకున్నా కమర్షియల్‌గా పెద్దగా ఆడలేదు. నా నువ్వే అయితే పూర్తిగా డిజాస్టర్. ఈ రెండు డిజాస్టర్ల వల్ల నందమూరి అభిమానులు తమన్నాతో నందమూరి హీరోలు సినిమాలు చేసేందుకు ఇష్టపడడం లేదు. భోళా శంకర్ డిజాస్టర్ తమన్నా కెరీర్‌పై బాగా ప్రభావం చూపింది. ఆ తర్వాత ఆమె సీనియర్ హీరోల పక్కన కూడా నటించే ఛాన్సులు ఇవ్వడం లేదు. దీంతో తమన్నా హిందీ వెబ్ సిరీస్‌లు, ఓటిటి ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల కూడా టాలీవుడ్‌లో ఆమె హవా తగ్గింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు