
అత్తారింటికి దారేది ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. పవన్ కళ్యాణ్, సమంత, ప్రణీత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. అప్పట్లో లీకుల బెడదను ఎదుర్కొన్నా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల క్లబ్‌లోకి చేరిన తొలి సినిమాగా రికార్డులకు ఎక్కింది. కథ పాయింట్ చాలా చిన్నదైనా, త్రివిక్రమ్ టేకింగ్, ఎమోషనల్ రొమాంటిక్ ఫ్రేమ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్రివిక్రమ్ సినిమాల్లోని మ్యాజిక్ ముఖ్యంగా మాటల్లో ఉంటుంది. అతను రాసే సంభాషణలు, పాత్రల మధ్య ఉండే భావోద్వేగాలు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. కానీ ఇదే సమయంలో ఒక విమర్శ ఎప్పటికీ కొనసాగుతోంది – త్రివిక్రమ్ సినిమాల్లో రెండవ హీరోయిన్ పాత్రలు చాలా వరకూ ప్రాధాన్యం లేకుండా ఉంటాయి.
ఒక్కసారి త్రివిక్రమ్ సినిమాల్లో రెండో హీరోయిన్ పాత్రలు చూస్తే పార్వతీ మెల్టన్ (జల్సా), నిత్యా మీనన్ (సన్నాఫ్ సత్యమూర్తి), ఈషా రెబ్బ (అరవింద సమేత), నివేత పేతురాజ్ (బ్రో), ప్రణీత (అత్తారింటికి దారేది) ఈ జాబితా చూసినా ఇదే విషయం స్పష్టమవుతుంది. ఈ హీరోయిన్లకు అందం ఉన్నా, నటనా పరంగా కష్టపడినా.. స్క్రీన్ స్పేస్ తక్కువుగా ఉండడంతో ఈ పాత్రలకు మంచి పేరు రాలేదు. ఈ క్రమంలోనే అత్తారింటికి దారేది సినిమా సూపర్ హిట్ అయినా సమంత ముందు ప్రణీత కష్టం తేలిపోయింది. పవన్ పక్కన చేశానన్న సంతృప్తి కూడా ప్రణీతకు రాలేదు. అయితే త్రివిక్రమ్ కథ చెప్పే టైంలో సమంత కంటే నీకే ఎక్కువ స్కోప్ ఉంది.. ఎమోషనల్ పార్ట్ అంతా నీమీదే రన్ అవుతుందని చెప్పాడట. కానీ తెరమీద ఫైనల్ కాపీ చూశాక కాని ప్రణీతకు తాను మోసపోయానని అర్థం కాలేదని ఆమె సన్నిహితుల దగ్గర వాపోయిందట.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు