
ముఖ్యంగా ఇతర భాషల సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఇది వర్తిస్తుంది అంటూ ఫెడరేషన్ సంస్థ వెల్లడించింది. ఇటీవలే ఫిలిం ఛాంబర్ లో జరిపిన చర్చలు విఫలం అవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇందుకు సంబంధించి ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఒక లేఖను కూడా విడుదల చేసింది. ఫెడరేషన్ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాలని ఎవరు షూటింగ్లో పాల్గొనకూడదు అంటూ హెచ్చరించారు.. షూటింగ్ ఎక్కడ జరిగినా కూడా ఇది వర్తిస్తుంది అంటూ తెలియజేయడం జరిగింది.
అయితే నిర్మాతలు మాత్రం రూల్స్ ప్రకారం కేవలం 5 శాతం మాత్రమే జీతాలు పెంచుతామని చెప్పినప్పటికీ కూడా ఎంప్లాయిస్ ఫెడరేషన్ మాత్రం ఒప్పుకోవడం లేదు 30% పెంచిన వారికే సినిమా షూటింగ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో బడా చిత్రాలు సైతం సెట్స్ పైన ఉన్నాయి ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదల డేట్స్ కూడా అనౌన్స్మెంట్ చేశారు. మరి ఇలాంటి సమయంలో ఎంప్లాయిస్ ఫెడరేషన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల చాలామంది నిర్మాతలు, డైరెక్టర్లకు కూడా పెద్ద షాక్ అని చెప్పవచ్చు.. మరి ఇందుకు సంబంధించి ఈరోజు ఏమైనా చర్చలు జరుపుతారా లేకపోతే ఈ సినిమా షూటింగ్ బంద్ ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి మరి.