
అలాగే అల్లు అర్జున్, అట్లీ కాంబో మూవీలోనూ ఒక హీరోయిన్‌గా ఎంపిక అయింది. మరోవైపు బాలీవుడ్ లో `హై జవానీ తో ఇష్క్ హోనా హై`, `తుమ్ హో తో`, `పూజా మేరీ జాన్` వంటి చిత్రాల్లో నటిస్తోంది. సినిమాల గురించి పక్కన పెడితే.. ఆగస్టు 1న మృణాల్ 34వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా తన క్లోజ్ ఫ్రెండ్స్ కు పార్టీ ఇచ్చింది. మౌనీ రాయ్, తమన్నా, నుష్రత్ బరూచా, రోష్ని వాలియా తదితరులు పార్టీకి హాజరయ్యారు.
అయితే తన బర్త్‌డే పార్టీలో మృణాల్ ధరించిన బుల్లి గౌను నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది. సింపుల్‌గా ఉన్న మృణాల్ ఫ్రాక్ ధర తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవుతాయి. లూయిస్ విట్టన్ ఫాల్-వింటర్ 2022 కలెక్షన్ నుంచి అదిరిపోయే పూల జాక్వర్డ్ మినీ ఫ్రాక్ ను మృణాల్ ఠాకూర్ ధరించింది. ఇటలీలో తయారు చేయబడిన ఈ డ్రెస్ ఖరీదు సుమారు రూ. 2.83 లక్షలు అని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలిసి షాక్ అవ్వడం నెటిజన్ల వంతైంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు