తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ తాజాగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన కింగ్డమ్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. సత్యదేవ్ ఈ మూవీ లో విజయ్ దేవరకొండకు అన్న పాత్రలో నటించగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు.

మూవీ భారీ అంచనాల నడుమ జూలై 31 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు మంచి ఓపెనింగ్లు కూడా దక్కాయి. ఆ తర్వాత కూడా ఈ మూవీ కి సాలిడ్ కలెక్షన్లు దక్కుతున్నాయి. ఈ మూవీ విడుదల అయినా మూడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇక పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన హరిహర వీరమల్లు మూవీ టార్గెట్ ను జస్ట్ లో మిస్ అయింది. అసలు విషయంలోకి వెళితే ... కింగ్డమ్ మూవీ విడుదల అయిన మూడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.34 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది.

పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ భారీ అంచనాల నడుమ జూలై 24 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మూడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.45 కోట్ల షేర్ కలక్షన్లు దక్కాయి. ఇలా హరిహర వీరమల్లు సినిమా టార్గెట్ ను కింగ్డమ్ మూవీ జస్ట్ లో మిస్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd