
పరువు హత్యల నేపథ్యంలో ఈ మూవీ స్టోరీ సాగుతుంది. శ్రీలీల హీరోయిన్‌గా ఎంపికైంది. కానీ ఏవో కారణాలతో ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకుంది. శ్రీలీల స్థానాన్ని మరో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సేతో మేకర్స్ భర్తీ చేశారు. ఇదిలా ఉంటే.. లెనిన్ మూవీ షూటింగ్ ఆగిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచార జరుగుతోంది. పెళ్లి కారణంగా లెనిన్ షూటింగ్ నుంచి అఖిల్ బ్రేక్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ సినిమా మళ్లీ సెట్స్ మీదకు వెళ్ళినట్టు దాఖలాలు లేవు.
మరోవైపు నిర్మాతలు కూడా సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో లెనిన్ షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేకప్ పడినట్టు ఫిల్మ్ సర్కిల్స్ తో బలంగా టాక్ నడుస్తోంది. ఇందుకు హీరోయిన్ కారణమని కొందరు అంటుండగా.. బడ్జెట్ కారణమని ఇంకొక టాక్ వినిపిస్తుంది. ఏదేమైనా అఖిల్ మాత్రం లెనిన్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని కసి మీద ఉన్నాడు. మరి అయ్యగారి కోరిక తీరుతుందా? లేదా? అనేది చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు