రేపే ఎంతో పవిత్రమైన పుత్రదా ఏకాదశి . హిందూ సాంప్రదాయంలో ఏకాదశికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది.  చాలా మంది ఏకాదశి పవిత్రంగా జరుపుకుంటూ ఉంటారు . అందులోనూ పుత్రదా ఏకాదశిని మరింత విశేషమైనదిగా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు . శ్రావణమాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు . ఈ ఏకాదశి నాడు సంతానం లేని వాళ్ళు ప్రత్యేకంగా పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు.  శ్రీ మహావిష్ణువును పూజించే పవిత్రమైన రోజుగా పురాణాలు చెప్పబడుతున్నాయి . సంతానం లేని దంపతులు ఈ పుత్రదా ఏకాదశిని ఆచరించడం వల్ల సంతన భాగ్యం కలుగుతుంది అనేది వాళ్ల నమ్మకం . ఆగస్టు నెల శ్రావణమాసంలో వచ్చే పుత్రదా ఏకాదశి తిధి 2025 ఆగస్టు 4వ తేదీ ఉదయం 11 గంటల : 41 గంటలకు ప్రారంభమవుతుంది.


అయితే ఈ తిధి ఆగస్టు 2025వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు గంటలకు పూర్తవుతుంది . ఏ తిధి అయినా సరే హిందూ సాంప్రదాయంలో ఉదయం తిధినే పరిగణలోకి తీసుకుంటారు . ఆ విధంగా చూసుకుంటే ఆగస్టు 5వ తేదీ మంగళవారం రోజు పుత్రదా ఏకాదశి ఉపవాసం, పూజలు ఆచరించాలి. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అనేది వాళ్ల నమ్మకం.  వివరంగా చెప్పాలి అంటే ఇది మూడు రోజుల వ్రతం . 2025 ఆగస్టు 4వ తేదీ దశమి తిధి అంటే ఈ దశమి రోజు మాంసం , ఉల్లిపాయలు ,వెల్లుల్లి , మసాలాలు, కారాలు అలాంటివి ఏమీ లేకుండా భోజనం చేయాలి .



అది కూడా ఒక్క పూటే సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి . ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి . అనంతరం ఆగస్టు 5 అంటే ఏకాదశి తిధి . ఈరోజు ఉదయం నిద్ర లేచి స్నానం చేసి శుభ్రంగా ఇల్లు వాకిల్లు క్లీన్ చేసుకుని.. పూజ మందిరాన్ని శుభ్రపరచుకుని ధూప దీపాలతో రకరకాల పువ్వులతో నైవేద్యాలతో శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని పసుపు వస్త్రం పై ఉంచి అభిషేకం చేయాలి. ఆ తర్వాత పసుపు - కుంకుమ - పండ్లు - తులసి ఆకులతో పూజ చేయాలి. ఈరోజు నోటి నుండి ఎటువంటి తప్పుడు మాట రాకూడదు .



వీలైతే పుత్రదా ఏకాదశి వ్రత కథ చదవాలి. కుదిరితే రాత్రికి జాగారం చేయాలి. సినిమాలు వెబ్ సిరీస్ లు కాకుండా పూర్తిగా విష్ణుమూర్తి నామస్మరణం చేయాలి.  అనంతరం ఆగస్టు ఆరవ తేదీ అంటే ద్వాదశి తిధి రోజు ఉదయం 5 గంటలకే నిద్రలేచి ఏడున్నరలోపు ఉపవాసం విరమించాలి . అంతేకాదు కుదిరితే బ్రాహ్మణులకు భోజనం పెట్టడం.. దానం చేసి ఆ తర్వాత భోజనం చేయడం చాలా చాలా మంచిది . ఇలా భక్తిశ్రద్ధలతో ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది అనేది జనాల నమ్మకం.



నోట్: ఈ కథనంలో తెలియజేసిన సమాచారం కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే . కొన్ని శాస్త్రాలలో కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగానే ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడినది. ఇది ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా పాఠకుల అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: