అమితా బచ్చన్ , ధర్మేంద్ర ,  సంజీవ్ కుమార్ , హేమమాలిని , జయాబాధురీ , అంజాద్ ఖాన్ తారాగనంగా రమేష్ సిప్పీ దర్శకత్వంలో చాలా సంవత్సరాల క్రితం షోలే అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా 1975 ఆగస్టు 15 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా ఎన్నో కొత్త రికార్డులను సృష్టించింది. ఇక ఈ సినిమా విడుదల అయ్యి ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీతో 50 సంవత్సరాలు పూర్తి అవుతుంది. మరి ఈ సినిమా 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి అనేక ఆసక్తికరమైన వివరాలను తెలుసుకుందాం.

ఒక సినిమా అనేది చూసే ప్రేక్షకుడి మదిని దోచుకున్నట్లయితే , ప్రేక్షకుడిని సినిమా నుండి బయటకు రాకుండా చేసినట్లయితే అది ఒక అద్భుతమైన సినిమా. అలా అద్భుతమైన సినిమా చేయాలి అంటే వందల కోట్ల బడ్జెట్ అవసరం లేదు. భారీ సెట్లు అవసరం లేదు. పెద్ద పెద్ద తారాగణం అవసరం లేదు. సినిమాలో మంచి కథ ఉండి , ఆ కథను అద్భుతంగా నడిపించే సత్తా దర్శకుడిలో ఉన్నట్లయితే మూవీ అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాంటి గొప్ప సినిమాల్లో షోలే ఒకటి. షోలే సినిమాలో అమితా బచ్చన్ , ధర్మేంద్ర పాత్రలు హైలెట్. వీరిద్దరి మధ్య ఉండే ఫ్రెండ్షిప్ మరో హైలెట్. ఇప్పటికీ ఫ్రెండ్షిప్ పై ఎన్ని సినిమాలు వచ్చిన షోలే మాత్రం అద్భుతమైన స్థానంలోనే నిలుస్తూ ఉంటుంది.


అంత గొప్పగా దర్శకుడు ఈ సినిమాలో ఫ్రెండ్షిప్ ను చూపించాడు. ఈ సినిమాలో అమితా బచ్చన్ ఎప్పుడు ఒక కాయిన్ తో టాస్ వేస్తూ ఉంటాడు. ఇక లాస్ట్ లో అలా కాయిన్ వేసి అమితాబచ్చన్ చనిపోతాడు. ఇక ఆ తర్వాత ధర్మేంద్ర కు తెలుస్తోంది. ఆ కాయిన్ కి రెండు వైపులా కూడా హెడ్స్ ఉన్నాయి అని. అలా అమితాబచ్చన్ ఇంత కాలం పాటు నన్ను మోసం చేశాడు అని ఆయన అనుకుంటాడు. అలాగే చివరన అలా మోసం చేసి తన చనిపోయాడు అని గ్రహిస్తాడు. ఇక ఈ సినిమా ఎన్నో సెంటిమెంట్స్ ను దాటి మంచి విజయం సాధించింది.

కొన్ని కారణాల వల్ల షోలే మొదటి షార్ట్ అనుకున్న సమయానికి తీయడం కుదరలేదు. రెండవ రోజు వితంతువు పాత్రలో నటించిన జయ భాధురి తెల్ల చీర కట్టుకొని  అమితా బచ్చన్ కి ఇనపెట్ట తాళాలు ఇచ్చే సన్నివేశాన్ని మొదటి షాట్ గా చిత్రకరించారు. దాదాపు హిందీ సినీ పరిశ్రమలో వితంతువుపై వచ్చే సన్నివేశాన్ని మొదటి షాట్ గా చిత్రీకరించరు. అలా చిత్రీకరించడం నెగిటివ్ గా ఫీల్ అవుతుంటారు. కానీ ఆ సెంటిమెంట్ ను పక్కన పెట్టేసి షోలే మూవీ లో ఒక వితంతువుపై మొదటి షాట్ ను తీశారు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. అప్పటివరకు హిందీ సినీ పరిశ్రమలో ఎవరైనా దొంగ దొంగతనానికి వెళ్లాలి అంటే కాళీమాత విగ్రహం ముందు పూజలు చేసి వెళ్లేవారు.

కానీ షోలే మూవీలో గబ్బర్ సింగ్ మాత్రం కాళీమాత ముందు పూజలు చేయడు. అలా ఆ సెంటిమెంట్ ను కూడా షోలే మూవీ యూనిట్ బ్రేక్ చేసింది. అలా అనేక సెంటిమెంట్లను బ్రేక్ చేసిన షోలే ఆ సమయంలో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదల అయ్యి 50 సంవత్సరాలు కావడానికి సమయం దగ్గర పడిన  ఇప్పటికి ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతుంది అంటేనే అర్థం అవుతుంది ఈ సినిమా ఏ రేంజ్ ఇంపాక్ట్ ను చూపించింది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: