యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో కొంత కాలం క్రితం దేవర పార్ట్ 1 అనే సినిమా వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. దేవర పార్ట్ 1 మూవీ సూపర్ సక్సెస్ కావడంతో ఆ తర్వాత వెంటనే దేవర పార్ట్ 2 మూవీ స్టార్ట్ అవుతుంది అని చాలా మంది భావించారు. కానీ తారక్ మాత్రం దేవర సినిమా తర్వాత వేరే సినిమాలకు కమిట్ అవుతూ వెళ్లడం , ఆ మూవీల పైనే ఫోకస్ పెడుతూ ఉండడంతో దేవర పార్ట్ 2 మూవీ ఉండదు అనే వార్తలు కూడా ఒకానొక సమయంలో వచ్చాయి. అలాంటి తరుణం లోనే తారక్సినిమా ఈవెంట్లో భాగంగా మాట్లాడుతూ ... దేవర పార్ట్ 2 కచ్చితంగా ఉంటుంది.

ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అవుతుంది అని చెప్పాడు. దానితో దేవర పార్ట్ 2 ఖచ్చితంగా ఉంటుంది అని తారక్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా నమ్ముతూ వచ్చారు. ఇది ఇలా ఉంటే తాజాగా దేవర పార్ట్ 2 మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... వచ్చే సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరి నెల నుండి దేవర పార్ట్ 2 మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు , ఇక కొరటాల శివ ప్రస్తుతం దేవర పార్ట్ 2 మూవీ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ , ప్రీ ప్రొడక్షన్ పనుల్లో అత్యంత బిజీగా ఉన్నట్లు , మరికొన్ని రోజుల్లోనే ఈ పనులు మొత్తం పూర్తి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే తారక్ తాజాగా వార్ 2 అనే హిందీ సినిమాలో నటించాడు. ఈ మూవీ ఆగస్టు 14 వ తేదీన విడుదల కానుంది. ప్రస్తుతం తారక్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా ఈ సంవత్సరం నవంబర్ లేదా డిసెంబర్ వరకు కంప్లీట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దానితో వచ్చే సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరి నెల నుండి తారక్ కూడా దేవర పార్ట్ 2 మూవీ షూటింగ్లో జాయిన్ కాబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: