
రూ.3,500 కోట్ల మేరకు ప్రజాధనం దుర్వినియోగంగా మారిందని లిక్కర్ స్కామ్ పై జరుగుతున్న ప్రచారంపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఏ ఆధారాలు లేకుండా పార్లమెంటు సభ్యుడిని అరెస్టు చేయరు కదా?.. అన్ని ఆధారాలు లభిస్తే బిగ్ బాస్ ను సైతం అరెస్టు చేస్తామంటూ తెలియజేశారు. దీంతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఇంకా ఎలాంటి ఆధారాలు లభించలేదా అనే చర్చ కూటమి నేతలలో మొదలయ్యింది. ఈ లిక్కర్ స్కామ్ వల్ల వైసీపీ పార్టీ ఇబ్బంది పడుతూనే ఉంది.
మాజీ సీఎం జగన్ కు చాలా సన్నిహితులలో ఎంపీ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు వల్ల ఇబ్బందులు మొదలయ్యాయని ప్రచారం జరుగుతోంది. మొదటి ఛార్జిషిట్ లో వసూలు చేసిన కమిషన్ డబ్బులు మాజీ సీఎం జగన్ కి అందినట్లుగా సిట్ అధికారులు తెలియజేశారనే విధంగా వినిపిస్తోంది. కానీ ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నాయా లేవా అనే విషయం మాత్రం ఇంకా క్లారిటీగా రాలేదట. జగన్ పాత్రకు సంబంధించి ఇందులో ఆధారాలు ఉంటేనే తప్ప ఆయనను నిందితుడిగా చేర్చలేమంటూ మరొకవైపు అధికారులు తెలియజేస్తున్నారు. తాజాగా కేంద్రమంత్రి పెమ్మసాని చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే జగన్ లిక్కర్ స్కామ్ పైన ఎలాంటి ఆధారాలు సేకరించలేదనే అనుమానాలు కనిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.