ఒకటో తేదీ జీతం పడగానే అందరూ పరుగు పరుగున వెళ్లేది డీ మార్ట్ . ఏదైనా గిఫ్ట్ ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే అందరూ ముందుగా గుర్తు చేసుకునేది డి మార్ట్ . మిడిల్ క్లాస్ పీపుల్స్..బిలో మిడిల్ క్లాస్ పీపుల్స్ నాలుగు రూపాయలు సేవ్ చేసుకుందాం.. ఏదైనా తక్కువ గా కిరాణా వస్తువులు దొరికే షాప్ ఉంది అని అనుకోగానే గుర్తు వచ్చేది డిమార్ట్ . ఒకటి కాదు రెండు కాదు A TO Z ఇక్కడ అన్ని దొరుకుతాయి.  ఇంటికి కావాల్సిన సామాన్లు ..కిరాణా వస్తువులు బియ్యం , నూనె, సబ్బౌ, టూత్ పేస్ట్ , పిల్లలు ఆడుకునే ప్రొడక్ట్స్, బట్టలు, మేకప్ ఐటెమ్‌స్..ఇలా ఒకటా రెండా డీమార్ట్ లోకి అడుగుపెడితే పడిన జీతం మొత్తం ఖాళీ చేసుకుని బయటకు రావాల్సిందే.  ఇలా కూడా జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు . చాలామంది DMART కి వెళ్దాం DMART కి వెళ్దాం డీమార్ట్ లో షాపింగ్ చేద్దాం అనుకుంటారు కానీ అసలు "Dmart" లో "D" అంటే ఏంటి ..? అనేది ఎవరికీ పెద్దగా తెలియదు . అసలు డిమార్ట్ లో డి అంటే ఏంటి..? ఎందుకు డిమార్ట్ అనే పేరు వచ్చింది..? అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!


నిజంగానే  D Mart లోని "D" అంటే ఏంటి? అనేది చాలామందికి క్లారిటీ ఉండదు.D Mart లో "D" అంటే ఏమిటి అంటే "damaani". ఇది దమాని కుటుంబాన్ని సూచిస్తుంది. ఈ Dmart ను స్థాపించిన వ్యక్తి పేరు రాధాకిషణ్ దమాని . మధ్య తరగతి జనాలకు ఏదైన చౌకగా అందించాని అని ముందుగా Supaer Market స్టార్ట్ చేశారు. అది బాగా క్లిక్ అయ్యింది. ఆ తరువాత ఆయన ఇంటి పేరుని హైలెట్ చేస్తూ D Mart అంటూ పేరు పెట్టారు.



ఎందుకు ఎక్కువుగా జనాలు ఎగబడేలా కొనుగోలు చేస్తారు?

D Mart లో క్రౌడ్ ఎక్కువగా ఉండటానికి మెయిన్ రీజన్ ఆఫర్స్. తక్కువ ధరలకే అన్ని లభిస్తాయి. మార్కెట్ కంటే takkuva ధరలతో వస్తువులు అందిస్తారు. డిస్కౌంట్లు ఎక్కువుగా ఉంటాయి. మరీ ముఖ్యంగా బియ్యం, నూనె, సబ్బులు, టూత్ పేస్ట్ వంటివి వాటి పై భారీ డిస్కౌంట్లు ఇస్తారు. అంతేకాదు పలు బ్రాండెడ్ వస్తువులు మంచి నాణ్యతతో అందుబాటులో ఉంటాయి. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే వన్ స్టాప్ షాపింగ్ – రోజువారి అవసరాలన్నీ ఒకే చోట దొరకడం వల్ల అందరు డీ మార్ట్ కే ఎక్కువు వెళ్తారు. నిజానికి "D" అంటే డమని, కానీ జనాలు దానిని "Discount: అనే అర్థం  వచ్చేలా మార్చేశారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: