అయితే తాజాగా కిరణ్ తొలిసారి కుమారుడి ఫేస్‌ను మరియు నేమ్ ను రివిల్ చేశాడు. తాజాగా తమ బాబుతో కలిసి కిరణ్ రహస్య దంపతులు తిరుమల వెళ్లి శ్రీవారి దర్శించుకున్నారు. అలాగే అక్కడే బాబుకు `హను అబ్బవరం` అని నామకరణం కూడా చేశాడు. ఈ విషయాన్ని తెలుపుతూ కిరణ్ సోషల్ మీడియా ద్వారా కుమారుడి ఫోటోలు పంచుకున్నాడు.
ఇక బుడ్డోడు పంచ కట్టులో నుదుట నామాలు పెట్టుకొని చాలా క్యూట్ గా కనిపిస్తుండడంతో నెటిజన్లు లైకులు కురిపిస్తున్నారు. బాబు చాలా ముద్దుగా ఉన్నాడని.. అమ్మకు జిరాక్స్ కాపీలా ఉన్నాడని కొందరు అంటుండగా.. మరి కొందరు జూనియర్ అబ్బవరం అని కామెంట్లు పెడుతున్నారు. బాబుతో పాటు పేరు కూడా అద్భుతంగా ఉందని చాలా మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి కిరణ్ తనయుడు ఫోటోలు మాత్రం నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. కాగా, సినిమాల విషయానికి వస్తే.. `క`తో గత ఏడాది బిగ్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం ప్రస్తుతం `కె-ర్యాంప్`, `చెన్నై లవ్ స్టోరీ` అనే చిత్రాలు చేస్తున్నాడు.ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి