పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత హరిహర విరమల్లు అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. అలాగే పవన్ చాలా కాలం తర్వాత రీమేక్ మూవీ కాకుండా కొత్త కథతో రూపొందిన సినిమాలో నటించడంతో  ఈ మూవీ పై ఆయన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా .. ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభం అయింది. ఆయన ఈ సినిమా నుండి తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ అనే దర్శకుడు ఈ సినిమాను పూర్తి చేశాడు. ఈ మూవీ ని జులై 24 వ తేదీన పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా పెద్ద కలెక్షన్లను వసూలు చేయలేక పోతుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన పది రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. పది రోజుల్లో ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లు వస్తే ఈ మూవీ హిట్ స్టేటస్ను అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.

10 రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 18.90 కోట్ల కలెక్షన్ దక్కగా , సీడెడ్ లో 8.02 కోట్లు , ఉత్తరాంధ్రలో 7.61 కోట్లు , ఈస్ట్ లో 5.52 కోట్లు , వెస్ట్ లో 4.52 కోట్లు , గుంటూరులో 5.48 కోట్లు , కృష్ణ లో 4.79 కోట్లు ,  నెల్లూరులో 2 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 10 రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 56. 84 కోట్ల షేర్ ... 83.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. 10 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 5.01 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 6.31 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 10 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 68.16 కోట్ల షేర్ ... 111.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమా మొత్తంగా 127.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ సినిమా మరో 59.34 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: