రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అపోలో ఆస్పత్రి బాధ్యతలతో పాటు మెగా కోడలిగా ఉపాసన మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. తాజాగా ఉపాసన మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ హబ్ కు ఆమె కో చైర్ పర్సన్ గా నియమితులయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే చిరంజీవి సంతోషంతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

మా కోడలు ఉపాసన ప్రస్తుతం  తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కు కో చైర్ పర్సన్ అని చెప్పుకొచ్చారు.  ఉపాసనను  గౌరవప్రదమైన పదవిలో నియమించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.  ఇది గౌరవం అనడం కన్నా బాధ్యతను మరింత పెంచిందని చిరంజీవి వెల్లడించారు.  డియర్ ఉపాసన  నీ నిబద్ధత, ఫ్యాషన్ తో క్రీడల్లో దాగున్న  అపార ప్రతిభను  గుర్తించి ప్రోత్సహిస్తారని కామెంట్లు చేశారు.

ప్రతిభావంతులను  అగ్ర స్థానాల్లో నిలబెట్టడానికి  తగిన విధివిధానాలను రూపొందించడంలో  నీ వంతు కృషి చేస్తావని ఆశిస్తున్నానని సదా నీకు దేవుడి దీవెనలు  తోడుగా ఉంటాయని చిరంజీవి పేర్కొన్నారు.  తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కు  కో చైర్ పర్సన్ గా నియమించినందుకు  ఉపాసన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతఙ్ఞతలు తెలియజేశారు.  ఈ నియామకం తనకెంతో గౌరవాన్ని ఇచ్చిందని  ఆమె అన్నారు.

సంజీవ్ గోయెంకాతో కలిసి పని చేసే ఛాన్స్ రావడం  మరింత గౌరవంగా భావిస్తున్నట్టు వెల్లడించారు. ఉపాసన రాబోయే రోజుల్లో మరిన్ని అరుదైన ఘనతలను సొంతం చేసుకుని  ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా  నిలవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.  ఉపాసన తన ప్రతిభతో  అంతకంతకూ  ఎదుగుతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: