పూర్తి పదిహేనేళ్ళ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 2024 ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు వలె తగిలాయి. జాతీయ రాజకీయ వాతావరణం మారిపోతుంటే, వైసీపీ మాత్రం ఇప్పటికీ డిఫెన్స్ మోడ్ నుంచి బయటపడలేక పోతోంది. జగన్ అనే నాయకుడి చుట్టూ అల్లుకున్న పార్టీగా, ఈ పార్టీ రాజకీయాల్లో దూకుడు కన్నా సమాధానాలు చెప్పే తత్వానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. కానీ ప్రస్తుతం ఆ తత్వం పనిచేయని దశలోకి ప్రవేశించింది. బాబు ప్లాన్ ముందే పక్కాగా! .. 2009లో వైఎస్సార్ మరణించిన తర్వాతనే చంద్రబాబు జగన్ అనే శక్తిని ముందుగానే గుర్తించారు. అప్పటి నుంచే టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది.


2014 ఎన్నికల్లో లక్ష కోట్లు అవినీతి అంటూ వాడిన ప్రచార ఆయుధం, వైసీపీని తీవ్రంగా దెబ్బతీసింది. అయినా ప్రజల్లో ఉన్న సానుభూతితో 67 స్థానాలు సాధించి వైసీపీ ఎదుగుదల నిరూపించుకుంది. 2019లో ఫుల్ స్వింగ్ – కానీ ఇంకా డిఫెన్స్ మోడ్! ..  2019లో జగన్ గెలిచినా, టీడీపీ విమర్శలకు, ఆరోపణలకు, ప్రస్తావించిన వివేకా హత్య వంటి అంశాలకు వైసీపీ వైపు నుంచి ఎదురు మాటలు రావడం లేదు. ప్రజలు "ఒక్క ఛాన్స్" అంటూ మద్దతిచ్చారు. కానీ దాని తర్వాత వైసీపీ పబ్లిక్ నరేటివ్ను నిర్మించడంలో విఫలమైంది. పార్టీని డిఫెండ్ చేయడంలో ఓకే.. కానీ టీడీపీని ఆఫెన్సివ్‌లోకి నెట్టే వ్యూహాలేమీ కనిపించలేదు. 2024 - గట్టిగానే పడింది! .. ఈసారి వైసీపీ ఓటమి ఓ సాధారణ పరాజయం కాదు – అది ప్రజాస్పందనతో కూడిన హెచ్చరిక. జగన్ పాలనను ప్రజలు చూశారు.


 ఇప్పుడు “ఒక్క ఛాన్స్” అన్న సానుభూతి లేదు, “వైయ‌స్‌ కుమారుడు” అన్న చరిష్మా లేదు. పైగా సోషల్ మీడియా యుగంలో రాజకీయాలు "ఒకటి అంటే పది"గా మారిపోయాయి. అలాంటి సమయాల్లో వైసీపీ తాను మౌనంగా ఉంటూ ఎదురుదాడి లేకుండా సాగితే అది పార్టీకి తీవ్రమైన నష్టమే. ఇప్పుడు అవసరం – దూకుడు పాలిటిక్స్! .. వైసీపీ ఇప్పుడు పాత భద్రతా ఫార్ములా విడిచి, దూకుడుతో పాలిటిక్స్ చేయాల్సిన సమయం. టీడీపీ ఆరోపణలు చేస్తే కౌంటర్, దెబ్బకు దెబ్బ, ప్రజల్లోకి మెసేజ్ బలంగా వెళ్లేలా న్యారేటివ్ కన్‌స్ట్రక్షన్ అవసరం. లేకపోతే జగన్ మళ్లీ పునరాగమనం చేసే అవకాశం దరిదాపుల్లో ఉండదనే చెప్పొచ్చు. మొత్తానికి – ఇప్పుడు వైసీపీ డిఫెన్స్ ప్లాన్ కాకుండా పక్కా ఆఫెన్సివ్ పాలిటిక్స్ బాటలోకి వస్తే తప్ప, ఇది చివరి మ్యాచ్ అయిపోయే ప్రమాదం ఉంది!

మరింత సమాచారం తెలుసుకోండి: