
జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లను తిప్పికొడుతుంది. మునగాకు షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. బ్లడ్ గ్లూకోజ్ ఉత్పత్తిని తక్కువ చేస్తుంది. మధుమేహంతో బాధపడేవారు రోజూ మునగాకు దోస, సూప్ లేదా కూరలుగా తీసుకుంటే మేలే. మునగాకు లిపిడ్ లెవల్స్‌ను తగ్గించి హార్ట్ బ్లాకేజెస్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. కాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. పెద్దవారిలో ఆస్టియోపోరోసిస్ నివారణకు ఉపయోగపడుతుంది. చిన్న పిల్లలకు పెరుగుదల సమయంలో ఇవ్వవచ్చు. మునగాకు ఫైబర్ అధికంగా ఉండటం వల్ల పేగుల పని తీరును మెరుగుపరుస్తుంది.
జీర్ణరసాల ఉత్పత్తిని పెంచుతుంది. మునగాకు యాంటీ ఆక్సిడెంట్లు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. మెదడు ఫంక్షన్ మెరుగవుతుంది. డిప్రెషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. మునగాకులో విటమిన్ E, సింక్ వంటి పోషకాలు చర్మాన్ని గ్లో చేస్తాయి. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. డ్యాండ్రఫ్, హెయిర్ ఫాల్ సమస్యలకు సహాయపడుతుంది. మునగాకు లో క్యాలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఆకలి తగ్గుతుంది. మునగాకు శరీరంలోని వాపులను తగ్గిస్తుంది. శరీరంలో నొప్పులు, కీళ్ల వాపులు తగ్గించడంలో సహాయపడుతుంది. మునగాకూర – సాధారణ పప్పు లేదా కూరల్లో కలపవచ్చు. మునగాకు పొడి – సూప్‌లలో, టీలో కలిపి తీసుకోవచ్చు. మునగాకు స్మూతీ – అరటిపండు, యోగర్ట్‌తో కలిపి చేసుకోవచ్చు.