కోలీవుడ్ నటుడు అజిత్ సినీ ఇండస్ట్రీ లోకి వచ్చి 33 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అయితే ఇండస్ట్రీ లోకి వచ్చి 33 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేసుకున్నారు అజిత్.. మరి ఇంతకీ అజిత్ షేర్ చేసిన ఆ ఎమోషనల్ నోట్ లో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.. కోలీవుడ్లో అజిత్ స్టార్ హీరోగా మారారు. అయితే కోలీవుడ్ లో ఉన్న కొంతమంది హీరోలు బ్యాగ్రౌండ్ తో ఎదిగినప్పటికీ అజిత్ మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఎదిగారు. దీన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. "సినీ ఇండస్ట్రీలో 33 ఏళ్ల కెరీర్ ని పూర్తి చేసుకున్నాను అంటే దానంతటికీ కారణం నా అభిమానులే.. 

నేను ఎలాంటి సమయంలో ఉన్నా కూడా నన్ను అభిమానులు ఆదరించారు.. సినిమాలు ప్లాప్ అయినా హిట్ అయినా అభిమానులు నాతోనే ఉన్నారు. సినిమా అనే కష్టమైన దాంట్లో నేను 33 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. కాబట్టి మీతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను.. నాకు సినిమా నేపథ్యం లేదు బయటి నుండే వచ్చాను.కానీ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నా అభిమానులే. సినీ కెరియర్ లో ఎన్నో మైళ్ళ రాళ్ళను దాటాను. మరెన్నో మైలురాళ్లను దాటబోతున్నాను. ఈ 33 ఏళ్ల సినీ కెరియర్లో ఎన్నో వైఫల్యాలు, ఎదురుదెబ్బలు తగిలాయి. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా నిరంతరం పోరాడుతూనే ఉన్నా. ఏ పరీక్ష ఏదైనా అందులో గెలిచి పడి లేచిన కెరటంలా తయారయ్యా. 

నేను నమ్ముకున్న పట్టుదల అనే మార్గాన్ని ఎప్పుడు పోనిచ్చుకోలేదు. ఇక సినిమాల్లో రాణిస్తూనే మోటార్ రేసింగ్ లో కూడా అడుగులు ముందుకు వేశా. ఎన్ని దెబ్బలు తాకినా కూడా ఓర్చుకొని దేశం కోసం అడుగు ముందుకు వేసి పథకాలు తీసుకొచ్చే స్థాయికి ఎదిగాను. ఈ రేసింగ్ చేసే సమయంలో ఎంతోమంది నన్ను తొక్కేయాలని ఎదగనివ్వకుండా చేయాలని కుట్రలు చేశారు.కానీ వారందరి కుట్రలు, అవమానాలు తిప్పి కొట్టి దేశానికి పథకాలు తీసుకొచ్చాను. మరెన్నో తీసుకువస్తాను. ఎన్ని ఎదురు దెబ్బలు తాకినా ధైర్యంతో అడుగులు ముందుకు వేస్తాను. ధైర్యంతో ఉంటే దేన్నైనా సాధించగలం. నాకు సినిమాల్లో ఎన్నో పరాజయాలు ఎదురైనప్పుడు మీ ప్రేమే నన్ను మరిన్ని సినిమాలు చేసేలా ప్రోత్సహించింది.

 ఇక నేను ఈ స్థాయిలో ఉండడానికి నా భార్య శాలిని కూడా కారణం.ఆమె ఎల్లవేళలా నాకు తోడుగానే నిలిచింది. అయితే మీకు దగ్గరగా ఉండి మీతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండకపోవచ్చు. అందరిలా సినిమాలు నా నుండి రాకపోవచ్చు.. కానీ మీ నుండి వచ్చే ప్రేమను నేను ప్రతిక్షణం ఆస్వాదిస్తూనే ఉంటాను. ఈ సినీ కెరియర్లో 33 ఏళ్ల పాటు మీరు నన్ను గుర్తించి నా లోపాలను పక్కనపెట్టి నా ఎదుగుదలను ప్రోత్సహించారు. మీతో ఎప్పుడు నిజాయితీగానే ఉంటా.. అలాగే మోటార్ రేసింగ్ లో దేశానికి మరిన్ని పథకాలు తీసుకువస్తాను" అంటూ అభిమానులను ఉద్దేశించి ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు అజిత్..

మరింత సమాచారం తెలుసుకోండి: