కుక్క కరిస్తే ప్రమాదమని తెలుసు... కానీ, అది ఆప్యాయంగా నాకినా ప్రమాదమేనా..? అవును నిజమే..!! ప్రమాదమే.. యురోపియన్ జర్నల్ ఆఫ్ కేస్ రిపోర్ట్స్ ఇన్ ఇంటర్నల్ మెడిసిన్‌లో పేర్కొన్న అంశాలను చూస్తే తప్పకుండా షాకవుతారు. 63 ఏళ్ల వ్యక్తి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. ఎన్ని మందులు వాడుతున్నా అతడి వ్యాధి తగ్గలేదు. కండరాల నొప్పి, తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న అతడిని కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లో చేర్చారు. 

అయితే, ఆరోగ్యం చాలా వేగంగా క్షీణించింది. చివరికి ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. అతని ముఖం మీద బొబ్బలు, శరీరం దిగువ భాగాల్లో గాయాల్లాంటివి ఏర్పడ్డాయి. నాలుగు రోజులపాటు హాస్పిటల్‌లో ఉన్న అతడికి డాక్టర్లు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. చివరికి అది కుక్క లాలాజలం నుంచి సోకిన వ్యాధి అని తెలుసుకున్నారు. వ్యాధి నిర్మూలన కోసం వైద్యులు 16 రోజులు హాస్పిటల్‌లోనే ఉంచారు. కృత్రిమ శ్వాస అందిస్తూ అతడికి వైద్యం అందించారు. కానీ, అతడు ప్రాణాలు నిలవలేదు.

పెంపుడు కుక్క నాకడం వల్లే అతడు అనారోగ్యానికి గురైనట్లు వైద్యులు తెలిపారు. కుక్కులు, పిల్లలు లాలాజలంలో క్యాపానోసేటోఫగా (Capnocytophaga) అనే బ్యాక్టీరియా ఉంటుందని, అవి కరిచినప్పుడు గానీ, పళ్లతో గీసినప్పుడు లేదా నాకినప్పుడు అది మనిషి శరీరంలోకి చేరుతుందని వైద్యులు తెలిపారు.

కొంతమందికి Capnocytophaga బ్యాక్టీరియా సోకినా జ్వరం రాదని, అది క్రమేనా శరీరమంతా వ్యాపించి అకస్మాత్తుగా అస్వస్థతకు గురిచేసే ప్రమాదం ఉన్నట్లు రిపోర్టులో వెల్లడించారు. 25 శాతం ప్రమాదకరమైన ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఇలాంటి సమస్యలు చాలా అరుదుగా వస్తుంటాయని తెలిపారు. సుమారు 74 శాతం కుక్కలు ఈ ప్రమాదకర బ్యాక్టీరియాను కలిగి ఉంటాయన్నారు.పెంపుడు కుక్కలు తమ యజమానులను ఆప్యాయంగా నాకుతాయనే సంగతి తెలిసిందే. అయితే, అవి ఏమైనా గాయాలు, శరీరంపై ఏర్పడే పగుళ్లు, కళ్లు, ముక్కు, నోటిని నాకినట్లయితే.. వాటి లాలాజలం ద్వారా బ్యాక్టీరియా మనుషులకు సోకుతుందని డాక్టర్ థామస్ బట్లర్ ఓ వార్తా సంస్థకు వెల్లడించారు. ముఖ్యంగా కుక్కలతో ముఖం మీద నాకించుకోవడం చాలా ప్రమాదకరమని తెలిపారు.

ఎక్కువగా పెంపుడు కుక్కులతో గడిపే వ్యక్తులకు చాలా అరుదుగా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది.  సెండర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సూచనల ప్రకారం.. పెంపుడు జంతువులు నాకిన 1 నుంచి 14 రోజుల్లో మధ్య శరీరంపై బొబ్బలు, జ్వరం, గందరగోళం, వాంతాలు, కండరాలు, కీళ్ల నొప్పలు ఏర్పడినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఈ వ్యాధి సోకిన తర్వాత బాధితుడి పరిస్థితి చాలా దయనీయంగా మారుతుంది. తీవ్రమైన జ్వరం, నొప్పులు, ఊపిరి పీల్చుకోలేకపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, కళ్లు బైర్లు కమ్మడం, చమట కారడం వంటివి ఏర్పడతాయి. పేర్కొన్న లక్షణాల్లో కొన్ని ఉన్నా సరే వైద్యులను సంప్రదించడం ముఖ్యం. అలాగే, వీలైనంత వరకు కుక్కలతో శరీర భాగాలను, ముఖాన్ని నాకించుకొనే అలవాటుకు దూరంగా ఉండాలి. మీ శరీరం గాయాలను కుక్కలు నాకకుండా జాగ్రత్తపడాలి. కుక్కలతో ఆడుకున్నా లేదా అవి మిమ్మల్ని నాకినా వెంటనే శుభ్రం చేసుకోవాలి. పిల్లలకు కూడా ఈ అలవాటు చేయాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: