దాదాపు గత మూడు నెలలగా భారతదేశంలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ నిబంధనలను దేశవ్యాప్తంగా అమలు చేసినప్పటికీ లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ కుదుటపడేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలలో పూర్తి సడలింపులు ఇచ్చింది. దీంతో ప్రజలు అంతా బయటకు వస్తుండడంతో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతుంది. అందుకే ఎటువంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉంటూ తమ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని ఆహారపు మార్గదర్శకాలను వెల్లడించింది. అవేంటో చూద్దాం. 

IHG

ప్రతిరోజు సరిపడినన్ని లీటర్ల మంచి నీటిని తాగడం వలన శరీరంలోని విషతుల్యాలు బయటకి వెళ్తాయని, శరీరంలో ఎక్కువ నీరు ఉంటే ముక్కు శ్వాస నాళాల్లో జిగట పదార్థం అధిక స్థాయిలో ఉండి వైరస్ ని లోపలికి వెళ్లనివ్వదని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) సంస్థ తెలిపింది. కొబ్బరినీళ్లు, మంచినీళ్లు, నిమ్మరసం, పాలు మంచిగా తదితర ద్రవపదార్థాలను ప్రతిరోజు తాగుతుంటే కరోనా వైరస్ దరిచేరదు. 

IHG
ప్రోటీన్లు ఎక్కువగా ఉండే సోయా విత్తనాలు, పప్పు దినుసులు, గుడ్లు, పెరుగు తదితర పోషక పదార్థాలను ఆహారంలో ఉండేలా చూసుకుంటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుదలకు తోడ్పడతాయి. గుమ్మడి, పుచ్చ, పొద్దుతిరుగుడు విత్తనాలలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వలన వీటిని తరచూ తినడం ఆరోగ్యానికి మంచిది. విటమిన్ ఏ, బి, సి, డి అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం వలన శరీరంలో వైరస్ ని ఎదుర్కొనే శక్తి బాగా పెరిగిపోతుంది. వీటితోపాటు విటమిన్ బి6 అధికంగా ఉండే జొన్నలు, సజ్జలు పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. విటమిన్ B12 పుష్కలంగా లభించే చేపలు, మాంసం, చికెన్, గుడ్లు వారంలో రెండు మూడు సార్లు అయినా ఆరగించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: