మన తెలుగు సినిమాల్లో కొంతమంది నటులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా హైలెట్ అవుతున్నారు. ప్రధానంగా మహిళా అన్నట్లు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారంలో ఉన్నారు. అందులో ఎక్కువగా మనం సోషల్ మీడియాలో చూసేవారిలో ప్రగతి అలాగే సురేఖవాణి ఇద్దరు కూడా సందడి చేస్తున్నారు. వరుస ఆఫర్లు కోసం వీరు తీవ్రస్థాయిలో కష్టపడుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరికీ సీరియల్స్లో కూడా ఆఫర్లు వస్తున్నాయని కొంతమంది కామెంట్ చేయడం మనం చూస్తున్నాము. గతంలో కూడా వీరికి ఇదే తరహాలో ఆఫర్లు వచ్చాయి అనే ప్రచారం కొన్ని వెబ్ సైట్ లు ఎక్కువగా చేశాయి.

అయితే ఇప్పుడు సురేఖ వాణి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆమె ఒక వెబ్ సిరీస్ లో నటించే అవకాశం ఉందని ఆ వెబ్ సిరీస్ లో ఆమె పాత్ర బోల్డ్ గా ఉంటుందని దానికి సంబంధించిన కథను ఒక తమిళ దర్శకుడు ఆమెకు చెప్పాడని ఆ పాత్రకు సరిగ్గా సరిపోతుంది అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయడంతో సురేఖ వాణి భర్త కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఆమె కూతురు కూడా ఆ వెబ్ సిరీస్ లో నటించే అవకాశం ఉందని సమాజానికి ఒక సందేశం ఇచ్చే వెబ్ సిరీస్ అని అందులో ఆమె నటనకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని సినిమా వర్గాల మాట.

దీనికి సంబంధించి త్వరలోనే పోస్టర్ కూడా విడుదల చేయడంతో పాటుగా ముందు ఒక సాంగ్ ని విడుదల చేయవచ్చని సమాచారం. ఈ సినిమా షూటింగ్ మొత్తం చెన్నైలోనే జరుగుతుందని ఒక ఇంట్లో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేస్తారని భర్త లేకపోతే మహిళ పడే కష్టాలు, సమాజం రిసీవ్ చేసుకునే విధానం ఇవన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయని సినీ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: