నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీ గా ఉన్నాడో మన అందరికీ తెలిసిందే, ఇప్పటికే బాలకృష్ణ టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రగ్యా జైస్వాల్ పూర్ణ హీరోయిన్ యోగా తెరకెక్కిన అఖండ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి డిసెంబర్ 2 వ తేదీన విడుదల చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పై జనాలలో లో భారీ అంచనాలు కలిగి ఉన్నాయి, ఇప్పటికే  అఖండ సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన బాలకృష్ణ, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో శృతి హాసన్ హీరోయిన్ గా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఎన్ బి కె 107 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోతున్న ఒక సినిమాలో నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.

సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి కామెడీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం లో కూడా బాలకృష్ణ నటించడానికి రెడీగా ఉన్నాడు. ఇలా వరుస క్రేజీ సినిమాలను లైన్ లో పెడుతూ దూసుకుపోతున్న బాలకృష్ణ మరో క్రేజీ సినిమాలు సెట్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో టాప్ దర్శకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమాలో నటించబోతున్నాడు అని ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రీసెంట్ గా జరిగిన బాలకృష్ణ సినిమా ఓపెనింగ్ వేడుకకు కొరటాల శివ రావడం మరియు అలాగే బాలకృష్ణ తో చాలా సేపు సన్నిహితంగా మాట్లాడడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. ఈ వార్త పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒక వేళ ఈ వార్త నిజం అయితే మాత్రం బాలకృష్ణ తర్వాత సినిమాల లైనప్ మాత్రం అదిరిపోయింది  అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: