'ఆకాశం నీ హద్దురా' సినిమాతో సూర్య దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయిన ఈ సినిమా వల్ల అమెజాన్ ప్రైమ్ భారీ లాభాలను పొందింది. ఇక ఈ సినిమాతో సూర్య తన కెరీర్ బెస్ట్ క్రిటికల్ ప్రశంసలతో పాటు ఇంకా అలాగే మంచి సూపర్ హిట్ ని కూడా అందుకున్నాడు.ఇక కొన్ని వరస పరాజయాల తర్వాత సుధ కొంగర రూపంలో ఓ మంచి లేడీ డైరెక్టర్ తనకు అద్భుత విజయాన్ని ఇవ్వడంతో సూర్య అటుపై మరింత కాన్ఫిడెంట్ గా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యాడు.  నిర్మాతగా తన అర్ధాంగి జ్యోతికతో  కలిసి సినిమాలను నిర్మిస్తున్నాడు.ఇక తాజాగా కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న వేళ సూర్య నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ పోస్టర్ ని విడుదల చేసారు. ఎథరక్కుమ్ తునిన్దవన్ (ఇటి) టైటిల్ పోస్టర్ ని విడుదల చేసి విషెస్ తెలిపారు. పాండిరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.ఇక ఈ సినిమాలో సత్యరాజ్ లాంటి సీనియర్ నటుడు ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.
 స్టైలిష్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇమాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రియాంక మోహన్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. #ET #ఈటి #ಈಟಿ #ഇറ്റി #ईटी అంటూ ఈ నాలుగు హ్యాష్ ట్యాగుల్ని వైరల్ చేస్తున్న తీరును బట్టి ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీ అని భావించాల్సి ఉంటుంది.ఈ సినిమాతో సూర్య కూడా పాన్ ఇండియా రేసులో నిలిచేటట్లు వుంది. ఇక #ET అంటూ రెండక్షరాల టైటిల్ ని సూర్య టీమ్ చాలా వైరల్ గా ప్రమోట్ చేస్తూ పాన్ ఇండియా ఫీలర్స్ ని వదులుతున్నారు. పాండిరాజ్ లాంటి టాలెంటెడ్ అండ్ అవార్డ్ రేంజ్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న సినిమాగా ఈటీ సినిమాకి కూడా అంతే బజ్ ఉంది.ఇక ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఖాయమని పోస్టర్ ని బట్టి స్పష్టంగా అర్ధం అవుతుంది.ఇక రీసెంట్ గా జై భీమ్ తో గర్వించదగ్గ హిట్ ని అందుకున్న సూర్య ఈ సినిమాతో కూడా ఖచ్చితంగా పెద్ద హిట్ ని అందుకోవడం ఖాయం అని అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: