విక్టరీ వెంకటేష్.. సినీ ఇండస్ట్రీలోకి ప్రముఖ దిగ్గజ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న డి.రామానాయుడు వారసుడిగా అడుగుపెట్టిన విషయం అందరికి తెలిసిందే.. అయితే వెంకటేష్ తన తండ్రి బ్యాగ్రౌండ్ ను ఉపయోగించుకుని సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ స్వతహాగా తనలో ఉన్న ప్రతిభను ప్రేక్షకులకు కనబరిచి విక్టరీ వెంకటేష్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. తన సినిమాలలో ఒక వైపు కామెడీ చేస్తూనే.. మరో వైపు హీరోయిజాన్ని చూపిస్తూ విలన్లకు చుక్కలు చూపించేవాడు. ఇక మాస్ అభిమానులకు కూడా చక్కటి విందు భోజనాన్ని అందించే సినిమాలను అందించి తెలుగు ప్రేక్షకులలో ఒక చెరగని ముద్ర వేసుకున్నారు వెంకటేష్.కాకపోతే మొదటి సారి 1986వ సంవత్సరంలో తన తండ్రి కోరిక మేరకు దర్శక ధీరుడు రాఘవేంద్ర రావు తన  దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ ను కలియుగ పాండవులు అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.. అయితే ఈ సినిమా విడుదలైన మొదటి రోజే మంచి ప్రేక్షకాదరణ పొందడంతో పాటు ఉత్తమ నూతన కథానాయకుడుగా విక్టరీ వెంకటేష్ కు నంది అవార్డును సైతం తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా ఖుష్బూ, అశ్విని నటించి మంచి మార్కులు సంపాదించారు. ఇకపోతే ప్రముఖ పాత్రలో రావు గోపాల్ రావు, చలపతిరావు, సాక్షి రంగారావు, నూతన ప్రసాద్, సోమయాజులు వంటి తదితర ప్రముఖ నటులు ఈ సినిమాలో నటించారు.విక్టరీ వెంకటేష్ తన సోదరుడి సొంత నిర్మాణ బ్యానర్ అయినటువంటి సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమాలో పాటలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో ఒక అమ్మాయి తన స్నేహితులతో కలిసి కలియుగ పాండవులు గా మారి సమాజంలో పెద్ద మనుషులు అని చెప్పుకుంటూ చలామణి అవుతున్న చీడపీడల నుండి సమాజాన్ని ఎలా కాపాడారు అనేది ఈ సినిమా సారాంశం. ఇప్పటికికూడా ఈ సినిమా ప్రసారం అయితే మంచి టిఆర్పి రేటింగ్ ను సొంతం చేసుకోవడం కూడా గమనార్హం. ఈ సినిమా తరువాత విక్టరీ వెంకటేష్ హీరోగా మరింత స్థానానికి చేరుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: