దీంతో తెలుగు ప్రేక్షకులందరికీ ఈ పాట ఎంతగానో ఆకర్షించింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పాట వినిపిస్తుంది. చిన్న ల నుంచి పెద్దల వరకు అందరిని ఈ పాట ఆకర్షిస్తుంది. ఇక బుల్లితెరపై కూడా సెలబ్రిటీలు ఈ పాటపై హాట్ పర్ఫామెన్స్ లు చేస్తూ ఉండడం గమనార్హం. అయితే సాధారణంగా ఊ అంటావా ఉహూ అంటావా పాట వింటుంటే కిక్కేక్కి పోతు ఉంటుంది. అలాంటిది అందులో సమంత నటించడం.. ఎంతో కసి కసి గా ఉండే చూపులతో డాన్స్ పర్ఫామెన్స్ చేయడంతో ఈ పాట చూసిన తర్వాత ప్రేక్షకులందరికీ పిచ్చెక్కి పోయింది అని చెప్పాలి. ఇక ఊహించిన దానికంటే ఈ పాట సెన్సేషనల్ హిట్గా నిలిచింది.
అయితే ఈ ఐటెం సాంగ్ లో నటించడానికి ఒప్పుకోడానికి గల కారణం ఏమిటి అన్న విషయాన్ని సమంత ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మొదట ఈ పాటలో డాన్స్ చేయడానికి ఒప్పుకోలేదని కానీ ఆ తర్వాత బన్నీ మద్దతుగా నిలిచి ఈ పాటలో నటిస్తే మంచి గుర్తింపు అని చెప్పడంతో పాట చేయడానికి ఒప్పుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. కాగా కేవలం ఈ ఒక్క ఐటం సాంగ్ కోసమే ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేయగా.. సమంత రెమ్యూనరేషన్ అదే రేంజ్ లో ఉండటం గమనార్హం. మూడు నిమిషాలు ఐటమ్ సాంగ్ చేసేందుకు 5 కోట్లు డిమాండ్ చేయగా.. ప్రొడ్యూసర్లు కూడా చెల్లించినట్లు తెలుస్తోంది.