నాచురల్ స్టార్ నాని కొంత కాలం క్రితం విడుదలైన శ్యామ్ సింగరాయ్ సినిమాతో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. శ్యామ్ సింగరాయ్ సినిమా విజయంతో మంచి ఫామ్ లో ఉన్న నాచురల్ స్టార్ నాని తాజాగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన అంటే సుందరానికి మూవీ లో హీరోగా నటించాడు. ఈ సినిమాలో నజ్రియా కథానాయికగా నటించింది. శ్యామ్ సింగరాయ్ మూవీ తర్వాత నాని నటించిన సినిమా కావడం,  మెంటల్ మదిలో , బ్రోచేవారెవరురా లాంటి రెండు వరుస విజయాల తరువాత వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన సినిమా కావడం మొట్ట మొదటి సారి  నజ్రియా తెలుగులో నటించిన మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో  మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

అలా మంచి అంచనాలతో థియేటర్ లో విడుదల అయిన అంటే సుందరానికి మూవీ ప్రస్తుతం థియేటర్లలో పర్వాలేదు అనే రేంజ్ కలెక్షన్లను రాబడుతోంది. ఇప్పటి వరకు 9 రోజులు బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న అంటే సుందరానికి మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం.

నైజాం : 5.69 కోట్లు , సీడెడ్ : 1.16 కోట్లు , యూ ఎ : 1.37 కోట్లు , ఈస్ట్ : 95 లక్షలు , వెస్ట్ : 81 లక్షలు , గుంటూర్ : 89 లక్షలు , కృష్ణ : 86 లక్షలు , నెల్లూర్ : 58 లక్షలు ,
9 రోజులకు గాను అంటే సుందరానికి మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 12.31 కోట్ల షేర్ , 20.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 1.40 కోట్లు .
ఓవర్ సీస్ లో : 5.20 కోట్లు .
ప్రపంచ వ్యాప్తంగా 9 రోజులకు గాను అంటే సుందరానికి మూవీ 18.91 కోట్ల షేర్ , 33.55 కోట్ల  గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: