అంతకుముందు వరకు కేవలం తెలుగు స్టార్ మాత్రమే అయిన అల్లు అర్జున్ తన సినిమాలతో మళయాళ ఆడియెన్స్ ని మెప్పించాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని కేరళ లో మల్లూ అర్జున్ గా పిలుస్తారు. ఇక పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. పుష్ప రాజ్ పాత్రలో అతని వీరత్వం ప్రేక్షకులకి బాగా నచ్చేసింది. పుష్ప రాజ్ పాత్రతో బాలీవుడ్ ఆడియెన్స్ కి బాగా ఎక్కేశాడు బన్నీ. ఈ క్రమంలో అక్కడ ప్రమోట్ చేసే కొన్ని బ్రాండ్ లు కూడా అల్లు అర్జున్ వెంట పడుతున్నాయి.

స్టార్ హీరోలు వాణిజ్య ప్రకటలను చేయడం కామనే. అందులో మన తెలుగు స్టార్స్ విషయానికి వస్తే మహేష్ అందులో ముందుంటాడు. అయితే అల్లు అర్జున్ కూడా వాణిజ్య ప్రకటనలు చేస్తున్నాడు. ఇదివరకు సౌత్ వరకు ఒకరు.. బాలీవుడ్ లో మరొకరు యాడ్స్ చేసేవారు. ప్రొడక్ట్ ఒకటే అయినా వేరు వేరు స్టార్స్ ఇక్కడ అక్కడ ఉండేవారు. కానీ పుష్ప సినిమాతో వచ్చిన క్రేజ్ తో అక్కడ ఇక్కడ అల్లు అర్జున్ తోనే బ్రాండింగ్ చేయిస్తున్నారు. పుష్ప రాజ్ తో కోకా కోలా డీల్ సెట్ చేసుకుందని తెలుస్తుంది. నేషనల్ వైడ్ గా అతనికి ఉన్న క్రేజ్ దృష్ట్యా అల్లు అర్జున్ తో ప్రకటన చేస్తున్నారట.

సౌత్, నార్త్ రెండు భాషల్లో కూడా అల్లు అర్జున్ కనిపిస్తారని తెలుస్తుంది. బాహుబలి రిలీజ్ టైం లో ప్రభాస్ కి కూడా మహీంద్ర అండ్ మహీంద్ర నుంచి ఇలాంటి ఆఫర్ వచ్చింది. మొత్తానికి అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో వాణిజ్య ప్రకటనలతో కూడా సత్తా చాటుతున్నాడు. పుష్ప 2 త్వరలో సెట్స్ మీదకు వెళ్తుండగా ఆ సినిమా కోసం బాలీవుడ్ ఆడియెన్స్ సైతం ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: