మన ప్రేక్షకులు తమ అభిమాన హీరోలను కొన్ని కొన్ని పాత్రలలో చూసి ఆనందపడాలని కోరుకుంటారు. అలా తెలుగు సినిమా పరిశ్రమలో చాలామంది హీరోల అభిమానులు తమ హీరోలను స్పై పాత్రలలో నటిస్తే చూడాలని భావిస్తూ ఉంటారు. తెలుగులో ఎన్నో పాత్రలు చేసిన హీరోలైనా కూడా ఇలాంటి పాత్రలో నటించి తమ అభిమానులను అలరించాలని కోరికతో ఉంటారు.  ఆ విధంగా తెలుగులో ఇప్పుడు స్పై నేపథ్యంలో చాలా చిత్రాలే తెరకెక్కుతున్నాయని చెప్పాలి. అలాంటి సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా ది గోస్ట్. అంతకుముందు పలు స్పై సినిమాలలో కనిపించి ప్రేక్షకులను అలరించిన అతనిని నాగార్జున చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో స్పై గా నటించి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున స్పై గా నటించబోతున్నాడు. చాలా రోజుల తర్వాత ఆయన ఈ తరహా పాత్రలో నటిస్తూ ఉండడం విశేషం. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులలో మంచి అంచనాలను కలిగి ఉండగా ఈ పాత్ర ద్వారా నాగార్జున ప్రేక్షకులను ఏ స్థాయిలో అలదిస్తాడో చూడాలి. 

ఇక ఈ సినిమా తర్వాత ప్రేక్షకులను అలరించడానికి అక్కినేని అఖిల్ కూడా సిద్ధమవుతున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న ఐదవ సినిమా ఏజెంట్ లో స్పై గా నటిస్తూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. ఆ విధంగా ఇద్దరు తండ్రి కొడుకులు స్పైలుగా ఈ సంవత్సరం లో రాబోతున్నారు. ఇక మరొక యంగ్ హీరో నిఖిల్ కూడా స్పై అనే సినిమాలో స్పై గా చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉండగా ఈ సినిమా ద్వారా పా ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు దక్కించుకోవాలనే భావిస్తున్నాడు నిఖిల్.  ఆ విధంగా టాలీవుడ్ సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన ఈ స్పై చిత్రాలు ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: