రాజకీయాల్లో మళ్ళీ బిజీ కాకముందే పవన్ కళ్యాణ్ తాను ఒప్పుకున్నా సినిమాలను పూర్తి చేయాలనీ అభిన్నులు భావిస్తుంటే పవన్ మాత్రం వాటిని పూర్తి చేసే ఆలోచనలో లేనట్లు అనిపిస్తుంది. అయన హీరోగా తెరకెక్కాల్సిన సినిమాలు దాదాపు అరడజను ఉన్నాయి. వాటిలో ఏది విడుదల అవుతుంది అని చెప్పేకంటే ఏది ముందు తెరకెక్కుతుంది అన్న విషయంపై ఇంకా క్లారిటీ రావడం లేదు. ఏదేమైనా పవన్ రెండు పడవల ప్రయాణం ఎవరికీ పెద్దగా రుచించడం లేదు. సినిమా, పాలిటిక్స్ రెండూ ఒకేసారి చేస్తూ దీనిపై అయన శ్రద్ధ వహించడం లేదనిపిస్తుంది.

అయన రాజకీయాల విషయానికొస్తే అక్టోబర్ నుంచి పవన్ కల్యాణ్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు. ఎన్నికలు కూడా దగ్గరపడుతూ ఉండడంతో అయన ప్రజల్లోకి వెళ్లి బలం పెంచుకోవాలని భావిస్తున్నాడు.  ఈ క్రమంలోనే ఆ లోపు సినిమాల షూటింగ్స్ అన్నీ కంప్లీట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవాలి కానీ పవన్ ఆ విధంగా అడుగులు వేయట్లేదు అనిపిస్తుంది. ఇప్పటికే తెరకెక్కి విడుదల కావాల్సిన రెండు సినిమాలు ఇంకా షూటింగ్ కి కూడా వెళ్ళకపోవడం అందరిని నిరాశపరుస్తుంది. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తో అయన చేయాల్సిన ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ఇంకా మొదలవనేలేదు.

ఒక షెడ్యూల్ ఈ సినిమా ను మొదలుపెట్టారు కానీ ఆ తర్వాత పలు కారణాల వాళ్ళ ఆపేయాల్సి వచ్చింది. ఆ తర్వాత హరీష్ శనకర్ భవదీయుడు భగత్ సింగ్ కూడా చేయాల్సి ఉంది కానీ ఆ సినిమా ను సైతం ముందుకు తీసుకెళ్లలేకపోయారు. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలను స్ట్రైక్ అనంతరం మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన రానుంది. మరి ఈ రెండు సినిమాల తర్వాత రెండు సినిమాలను ఒప్పుకున్నాడు పవన్. సముద్ర ఖని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుండగా, మరొకటి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న సినిమా ను అయన చేయాలి. అవి ఎప్పుడు మొదలుపెడతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: