దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా  ఆర్ ఆర్ ఆర్ మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అలియా భట్ , ఓలివియా మూవీస్ హీరోయిన్ లుగా నటించగా ,  సముద్ర ఖని , అజయ్ దేవగన్ , శ్రేయ ఈ మూవీ లో  ముఖ్య పాత్రలో నటించారు. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య నిర్మించగా , ఎం ఎం కీరవాణిమూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మార్చి 25 వ తేదీన విడుదల అయ్యి ప్రపంచ వ్యాప్తంగా 1100 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

ఇలా థియేటర్ లలో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా కొన్ని రోజుల క్రితం నుండి 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో కూడా అద్భుతమైన రికార్డ్ లను సృష్టిస్తోంది. ఇది ఇలా ఉంటే థియేటర్ మరియు 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో అద్భుతమైన రికార్డ్ లను సృష్టించిన ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే స్టార్ మా చానల్లో ప్రసారం అయిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా బుల్లితెర ద్వారా కూడా అద్భుతమైన రెస్పాన్స్ ని తెచ్చుకుంది. బుల్లితెరపై మొదటి సారి ప్రసారం అయినప్పుడు ఈ మూవీ ఏకంగా 19.62 'టి ఆర్ పి' ని సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఇది అద్భుతమైన రెస్పాన్స్ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rrr