పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి మూవీ తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న విషయం మనకు తెలిసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. అలాగే వకీల్ సాబ్ మూవీ కూడా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది.  ఈ మూవీలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను అలరించాడు.

భీమ్లా నాయక్ మూవీలో రానా కూడా హీరోగా నటించాడు.  ప్రస్తుతం పవన్ కళ్యాణ్ , క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీలో నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ కొంత భాగం ముగిసిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిచిపోయింది. అలాగే తిరిగి మళ్లీ ఈ సినిమా షూటింగ్ ని ప్రారంభించి , కొంత భాగం షూటింగ్ పూర్తి చేసిన తర్వాత మళ్లీ ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అక్టోబర్ నెల నుండి తిరిగి హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ డేట్స్ ని ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' మూవీ తో పాటు తమిళ సినిమా వినోదయ సీతం మూవీ ని కూడా తెలుగు లో రీమేక్ చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలాగే వినోదయ సీతం మూవీ లో పవన్ కళ్యాణ్ పాత్ర నిడివి కాస్త తక్కువగా ఉండడంతో , కేవలం పవన్ కళ్యాణ్సినిమా కోసం 20 రోజులు పాత్రమే కేటాయించనున్నట్లు తెలుస్తుంది.  హరిహర వీరమల్లు మరియు వినోదయ సీతం మూవీ రీమేక్ ల కోసం పవన్ కళ్యాణ్  డేట్ లను ఇచ్చినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: