మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి అందరికి తెలుసు.. మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయమైన కూడా తన టా లెంట్ తో అందరినీ మెస్మరైజ్ చేస్తూ వస్తున్నాడు.. ఇటీవలే త్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారాడు..ఆ తర్వాత గ్యాప్ లేకుండా వరుస ప్రాజెక్టులకు సైన్ చేస్తున్నారు.. ప్రస్తుతం చెర్రి శంకర్ దర్శకత్వం లో ఓ సినిమా చేస్తున్నారు..rc15 తెరకెక్కుతుంది..ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది..ఇప్పటికే సినిమా నుంచి లీకులు కూడా భారీగా పెరిగాయి.ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ వస్తున్నారు..ఇకపోతే న్యూయర్ కానుకగా ఇప్పుడు మరో అప్డేట్ ను చిత్ర యూనిట్ ను విడుదల చేశారు..


చిరు ఓ సినిమాలో నత్తితో మాట్లాడుతూ అందరినీ ఆకర్షించారు..ఆ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది..ఇప్పుడు అచ్చం అలాంటి ఎమోషన్ నే పట్టుకునే ప్రయత్నమూ.. మనకు అందించే ప్రయత్నం చేస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్. చిరు తనయుడిగా కాకుండా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు చరణ్. తొలి నుంచి నటనలో మెరుగులు దిద్దుకుంటూ.. దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు చరణ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.ఫాదర్‌కు ఏం తీసపోని విధంగా తన స్టామరింగ్ యాక్టింగ్ ట్యాలెంట్‌ను చూపించేందుకు రెడీ అవుతున్నారు ఈ స్టార్ హీరో. శంకర్ తో చేస్తున్న తన పాన్ ఇండియన్ లో చెర్రీ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు..


ఒక క్యారెక్టర్ నత్తితో బాధపడుతూ పడే క్యారెక్టర్ అని తెలుస్తోంది  ఆ క్యారెక్టర్‌ ను ఓ ఛాలెంజ్‌గా తీసుకున్న చెర్రీ.. స్టామరింగ్ ఫర్ఫెక్ట్ గా వచ్చేందుకు తెగ ప్రాక్టీస్ చేస్తున్నారట. తన ఫాదర్ మెగాస్టార్ చిరు దగ్గర సజెషన్స్ తీసుకుంటున్నారట. రంగస్థలం చెవుడు క్యారెక్టర్ తరువాత.. స్టామరింగ్ యాక్టింగ్‌తో తన యాక్టింగ్ ట్యాలెంట్ ఏంటో మరో సారి చూపించే ప్రయత్నం చేయబోతున్నారట ఈ స్టార్ హీరో. ఇక ఈ పొలిటికల్ బ్యాక్డ్రాప్ తో ఉంటుందని తెలుస్తోంది.ఈ సినిమాలో అంజలి ,శ్రీకాంత్, సునీల్ లు కీలక పాత్రలో కనిపిస్తున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: