టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో నేషనల్ క్రష్ రష్మిక మందన ఒకరు. ఈ ముద్దు గుమ్మ ఛలో మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఈ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని ఆ తర్వాత గీత గోవిందం మూవీ తో మరో విజయాన్ని అందుకొని అతి తక్కువ కాలంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటి ఇప్పటికే ఎన్నో విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ప్రస్తుతం రష్మిక ... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో రెండవ భాగం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులం నిరాశపరచిన ఒక మూవీలో రష్మికకు ఆఫర్ వచ్చిందట. కాకపోతే ఆ సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటించలేదట. ఆ సినిమా ఏది..? ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం. 

తాజాగా నాగ చైతన్య హీరోగా ప్రతి శెట్టి హీరోయిన్ గా వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఈ మూవీ లో కృతి శెట్టి కంటే ముందు రష్మిక ను హీరోయిన్ గ తీసుకోవాలి అని ఈ మూవీ బృందం అనుకుందట. అందులో భాగంగా రష్మిక కు కథను కూడా వినిపించగా ... ఈ మూవీ లో తన పాత్రకు స్క్రీన్ స్పేస్ ఎక్కువగా లేదు అనే ఉద్దేశంతో ఈ ముద్దు గుమ్మ ఈ మూవీ కథను రిజెక్ట్ చేసినట్టు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: